Adipurush: ఆ నెగిటివిటీని తట్టుకుని ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?

ఈ ఏడాది రిలీజైన పెద్ద సినిమాలలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏదనే ప్రశ్నకు శాకుంతలం సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. దిల్ రాజు సపోర్ట్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో శాకుంతలం మూవీ ఫెయిలైంది. ప్రీమియర్స్ వేయడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత సైతం ఈ సినిమా ఫలితం గురించి స్పందించారు. తనపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో సమంత స్పందిస్తూ “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ” అనే శ్లోకాన్ని రాసుకొచ్చారు.

పని చేయడం వరకే నీకు అధికారం అని దాని ఫలంతో సంబంధం లేదని అందుకే ప్రతిఫలం ఆశించి ఏ పని చేయొద్దని అలా అని పని చేయడం మానొద్దని అర్థంతో సమంత పోస్ట్ పెట్టారు. భగవద్గీతలోని శ్లోకంతో సమంత ఈ కామెంట్లు చేశారు. అయితే శాకుంతలం సినిమా రిజల్ట్ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీని తట్టుకుని ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఆదిపురుష్ (Adipurush) పై బడ్జెట్ భారం కూడా ఊహించని స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ ను అందుకోలేదు. అందువల్ల ఈ సినిమాతో కచ్చితంగా ప్రభాస్ సక్సెస్ సాధించడంతో పాటు సత్తా చాటాల్సి ఉంది. ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ డైరెక్టర్ కాగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం అందుతోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాకు ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus