Balayya Babu: వీరసింహారెడ్డితో బాలయ్యకు ఆ రికార్డ్ సొంతమవుతుందా?

సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న వీరసింహారెడ్డి సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. సీడెడ్ లోని పలు జిల్లాలలో వీరసింహారెడ్డి సినిమాకు ఫస్ట్ డే టికెట్లు దొరకడం కష్టమవుతోంది. ఎర్లీ మార్నింగ్ షో టికెట్లు కొన్ని నిమిషాల్లోనే బుకింగ్ అయ్యాయంటే బాలయ్యకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థమవుతుంది. అన్ని ఏరియాలలో ఈ సినిమాకు బుకింగ్స్ విషయంలో మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. అయితే అఖండ సినిమాతోనే బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉన్నా

ఆ సమయంలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అయింది. అయితే వీరసింహారెడ్డి సినిమాకు 72 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. వీరసింహారెడ్డి సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరసింహారెడ్డి అఖండను మించిన విజయాన్ని అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య సినిమాలు రాబోయే రోజుల్లో కూడా సంచలనాలు సృష్టిస్తాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సంక్రాంతికి విడుదలవుతున్న రెండు సినిమాలు అంచనాలకు మించి మెప్పిస్తాయని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమా రిజల్ట్ విషయంలో కూడా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వీరసింహారెడ్డి సినిమాకు ఖర్చు విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదు.

మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి తెరకెక్కిన వీరసింహారెడ్డి ఫలితం గురించి మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. ఓవర్సీస్ లో కూడా వీరసింహారెడ్డి మూవీకి బుకింగ్స్ బాగున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు హాఫ్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. విదేశాల్లో కూడా బాలయ్య సినిమాలకు బుకింగ్స్ భారీ స్థాయిలో ఉంటున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus