Balakrishna, NTR: ఆ పొరపాటును సరిదిద్దేలా స్టార్ హీరో బాలయ్య అడుగులు వేస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ పుట్టినరోజుకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య పుట్టినరోజు వేడుకలను ఫ్యాన్స్ గ్రాండ్ గానే ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. బాలయ్య పుట్టినరోజున బాలయ్య నటించనున్న మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు బాలయ్యకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా భైరవద్వీపం, నరసింహ నాయుడు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు బాలయ్యకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు రీ రిలీజ్ కావడం ఏ మాత్రం సరైన నిర్ణయం అనిపించుకోదు. రెండు సినిమాలు రీ రిలీజ్ కావడం వల్ల అభిమానులలో ఏ సినిమా చూడాలనే సందేహం మొదలవుతుందనే సంగతి తెలిసిందే. అదే సమయంలో రెండు సినిమాలు భారీగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున కూడా చాలా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా ఎన్టీఆర్ జోక్యం చేసుకొని సింహాద్రి మాత్రమే రీ రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. రీ రిలీజ్ లో సింహాద్రి మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. బాలయ్య కూడా తన పుట్టినరోజు కానుకగా ఒక సినిమా మాత్రమే రీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరి బాలయ్య (Balakrishna) ఈ విధంగా చేస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుండగా ఆ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus