ఈసారైనా హిట్ అందుకుంటుందా..?

గతేడాది ‘భీష్మ’ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో నితిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడు నటించిన ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండూ కూడా డిఫరెంట్ జోనర్ కి చెందిన సినిమాలు అయితే చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేసిన ‘చెక్’ సినిమాపై మాత్రం అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. విభిన్నమైన సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దిట్ట. ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో ‘చెక్’ సినిమాపై చిత్రబృందం ఎంతో నమ్మకంగా ఉంది.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అప్పుడెప్పుడో ఓ వింక్ వీడియోతో సంచలనం సృష్టించింది ఈ బ్యూటీ. ఒక్కసారిగా యూత్ లో ఆమెపై క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో కొందరు నిర్మాతలు వెనక్కి తగ్గారు. అలానే ఆమె నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.

ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది. దీంతో ‘చెక్’ సినిమాపైనే తన హోప్స్ అన్నీ పెట్టుకుంది ప్రియా ప్రకాష్. ఈ సినిమాలో ఆమెది పూర్తిగా గ్లామరస్ రోల్ అని తెలుస్తోంది. కనీసం సినిమాతో అయినా తొలి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus