Chiranjeevi, Balakrishna: సంక్రాంతి లొల్లిపై బాలయ్య, చిరు రెస్పాన్స్‌ ఏంటో?

చిరంజీవి, బాలకృష్ణ ఒకేసారి బాక్సాఫీసు దగ్గరకు వస్తే ఆ సందడే వేరు. అయితే వచ్చే సంక్రాంతికి ఇద్దరూ వస్తున్నారు. కానీ సందడి మాత్రం వేరేది నడుస్తోంది. అదే ‘వరిసు వార్‌’. విజయ్‌ నటిస్తున్న ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారని.. ఈ క్రమంలో చిరంజీవి, బాలయ్య సినిమాలకు సరైన థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని ఓ వర్గం ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చూస్తే.. ఈ విషయమ్మీద జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో మరో మాట కూడా వినిపిస్తోంది. అదే వీరయ్య, వీర సింహం ఈ విషయంలో ఏం మాట్లాడరా? అని. అంటే సంక్రాంతి కోసం నిర్మాతల మండలి వర్సెస్‌ సీనియర్‌ నిర్మాతలు అనేలా మారిన ఇష్యూ గురించి చిరంజీవి, బాలకృష్ణ ఏమన్నా రియాక్ట్‌ అవుతారా అనేది ఎదురుచూస్తున్నారు. అయితే చరిత్ర చూసుకుంటే చిరు కానీ, బాలయ్య కానీ ఇలాంటి విషయాల్లో పెద్దగా స్పందించింది లేదు. మొత్తం భారం నిర్మాతల మీదే వేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త అదుపు తప్పుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్‌ స్పందనతో నిర్మాతల మండలి నిర్ణయం (తెలుగు సినిమాల ప్రాధాన్యం అనే లేఖ) పట్ల చర్చ మొదలైంది. ఇప్పుడు అశ్వనీదత్‌ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. దీంతో దిల్‌ రాజు (వరిసు నిర్మాత)కు సపోర్టు బాగానే ఉంది అంటున్నారు. ఇప్పుడు ఆయన సినిమాకు పోటీగా వస్తున్న సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌కు అర్జెంట్‌గా సపోర్టు కావాలి.

ఈ క్రమంలో అందరి చూపు చిరంజీవి, బాలకృష్ణ మీద పడింది. ఎందుకంటే తమ నిర్మాతకు మాట సాయం, అవసరమైతే చేత సాయం కూడా అవసరం ఏర్పడింది. మరి వీరి నుండి ఎలాంటి స్పందన వస్తుందా అని చూస్తున్నారు. అన్నట్లు మరో తమిళ సినిమా అజిత్‌ ‘తునివు’ కూడా సంక్రాంతికే అంటున్నారు. ఆ సినిమా నిర్మాత అయిన బోనీ కపూర్‌కు దిల్‌ రాజు బాగా క్లోజ్‌. ఆ లెక్కన దిల్‌ రాజు తమిళ సినిమాలు వర్సెస్‌ మైత్రీ తెలుగు సినిమాలు అయిపోయింది సిట్యువేషన్‌.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus