Chiranjeevi: ఆ సెంటిమెంట్ ను మెహర్ రమేష్ బ్రేక్ చేస్తారా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా అంచనాలకు మించి హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటివరకు 82 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన తెలుగు సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమా ఇదే కావడం గమనార్హం. వాల్తేరు వీరయ్య సక్సెస్ చిరంజీవి కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా సక్సెస్ భోళా శంకర్ సినిమాకు ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భోళా శంకర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా స్టార్ హీరోలతో మెహర్ రమేష్ తీసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ కథ అద్భుతంగా చెప్పినా సినిమా అద్భుతంగా తీయరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ సినిమాతో మెహర్ రమేష్ ఆ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

మెహర్ రమేష్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా దసరా పండుగకు వాయిదా పడిందని సమాచారం అందుతోంది. మెహర్ రమేష్ కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి ఈ సినిమా కోసం 45 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. తమన్నా ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తుండగా చెల్లి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ కు సైతం ఈ సినిమా కీలకం కానుంది. భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus