సితార ఎంటర్‌టైన్మెంట్స్ నాగవంశీ (Suryadevara Naga Vamsi) మాటలు చాలా సందర్భాల్లో వివాదాలకు దారి తీస్తుంటాయి. ఆయన కావాలని చేస్తారో లేక అనుకోకుండా అలా అయిపోతుంటుందో కానీ ఆయన మాటలు పెద్ద మాటలకు దారితీస్తుంటాయి. రీసెంట్‌గా వాళ్ల సినిమా ‘డాకు మహరాజ్’ (Daaku Maharaj) గురించి చెబుతూ.. చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కంటే బాగుంటుంది అని అన్నారు. ఆ రెండు సినిమాలకు బాబీనే (Bobby) దర్శకుడు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? చిరంజీవి త్వరలో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది అనే వార్తలొస్తున్నాయి.
Chiranjeevi
మామూలుగా తన మీద వచ్చే విమర్శలకు బహిరంగంగానే సమాధానాలు ఇవ్వడం లేదంటే కౌంటర్లు వేయడం చిరంజీవికి అలవాటు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎప్పుడు మీడియా ముందుకు వస్తారా అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది అని అంటున్నారు. మెగాభిమానులు చాలా నెలలుగా వెయిట్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు మరో 15 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారం వేగాన్ని పెంచాలని టీమ్ ప్లాన్స్ చేస్తోంది.
అందులో భాగంగా డిసెంబర్ 30న హైదరాబాద్ వేదికగా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. ఆ రోజు సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారు అని కూడా చెబుతున్నారు. ఆ ఈవెంట్‌కి చిరంజీవి మెయిన్ గెస్ట్ అని టాక్ నడుస్తోంది. ఒకవేళ చిరంజీవి వస్తే సంక్రాంతి సినిమాల గురించి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) గురించి చెబుతూనే.. బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బాబి ‘డాకు మహరాజ్’, వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) గురించి కూడా చెప్పాలి.
ఈ క్రమంలో ‘డాకు..’ ప్రొడ్యూసర్ నాగవంశీ మొన్నీమధ్య అన్న బెటర్ కామెంట్‌కు కౌంటర్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నిజానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలని అనుకున్నారు. పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాలని కూడా అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో ఆయన వీలు కుదరడం లేదట. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే సినిమా ఈవెంట్ పెట్టే ప్లాన్స్ నడుస్తున్నాయి.