Dasara: ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను దసరా మూవీ బ్రేక్ చేస్తుందా?

మరికొన్ని రోజుల్లో దసరా (Dasara) మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరిగింది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. అయితే సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా ఊరమాస్ అభిమానులను టార్గెట్ చేసి తీశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఊరమాస్ సినిమాలు క్లాస్ ప్రేక్షకులకు నచ్చడం అరుదుగా జరుగుతుంది. కొన్ని సినిమాలు క్లాస్ ప్రేక్షకులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు. ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను దసరా మూవీ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నానికి ఈ మధ్య కాలంలో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదనే సంగతి తెలిసిందే. నాని సినిమాలు 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సైతం సాధించడం లేదు.

అయితే దసరా సినిమా మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది. బయ్యర్లు సైతం ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను ఈ సినిమా ఏ స్థాయిలో నెరవేరుస్తుందో చూడాలి. కీర్తి సురేష్ సైతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా కీర్తి సురేష్ కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం అనే సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దసరా సినిమా కోసం కీర్తి సురేష్ తన లుక్ ను సైతం మార్చుకున్నారు. డీ గ్లామరస్ లుక్ లో కీర్తి సురేష్ మరింత అందంగా కనిపించారు. దసరా సినిమా కోసం నాని, కీర్తి సురేష్ కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. నాని, కీర్తి సురేష్ జోడీ అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus