Maruthi: ఆ సెంటిమెంట్ ను మారుతి బ్రేక్ చేస్తారా?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అటు గోపీచంద్ కెరీర్ కు ఇటు మారుతి కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. మంచి రోజులు వచ్చాయి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో దర్శకుడు మారుతి ఈ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మారుతి ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే ప్రభాస్, చిరంజీవి సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కనుంది.

ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావడంలో ఈ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనే సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ సినిమాతో మారుతి ఈ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయాల్సి ఉంది. మారుతి కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నా ఈ సినిమా రిజల్ట్ మారుతి కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుంది.

మారుతి గతంలోనే సీనియర్ హీరో వెంకటేష్ తో బాబు బంగారం సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ప్రభాస్ తో ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తానని మారుతి చెబుతున్నారు. డార్లింగ్, బుజ్జిగాడు తరహాలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు మారుతి వెల్లడించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పక్కా కమర్షియల్ రిజల్ట్ తర్వాత మారుతి ప్రభాస్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ వేగంగా సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus