Jr NTR: జాన్వీ, కొరటాల జాతకాలను యంగ్ టైగర్ మారుస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న ఎన్టీఆర్30 సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు గ్రాండ్ గా జరిగాయి. ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అయితే జాన్వీ కపూర్, కొరటాల శివ ఎన్టీఆర్ నే నమ్ముకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అటు జాన్వీ ఇటు కొరటాల శివ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో లేరనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి జాతకాన్ని మార్చేది తారక్ మాత్రమే అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జాన్వీ కొరటాల శివలకు ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. వీళ్లిద్దరూ ఎన్టీఆర్30 సినిమాకు పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ఎన్టీఆర్30 సినిమా హై లెవెల్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ప్రముఖలంతా ఈ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. జాన్వీ, కొరటాల శివ ఈ సినిమా కోసం ఈ సినిమా కోసం మరో ఏడాది సమయాన్ని పూర్తిస్థాయిలో కేటాయించనున్నారు.

జాన్వీ, కొరటాల శివ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్0 సినిమా కోసం కొరటాల శివ కసితో పని చేశారని బోగట్టా. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని ఫ్యాన్స్ ను ఈ సినిమా ఏ మాత్రం నిరాశ పరచదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన లుక్ ను సైతం మార్చుకున్నారని తెలుస్తోంది. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus