Jr NTR, Koratala Siva: రాజమౌళి సెంటిమెంట్‌ vs ఫ్లాప్‌ డైరక్టర్‌ సెంటిమెంట్‌.. విజయమెవరిది?

తారక్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటి? కొరటాల శివ సినిమా కాబోతే బాగుండు అని అనుకుంటున్నారు అభిమానులు. ఇదేంటి కొరటాల శివ సినిమా పక్కా అయిపోయింది, త్వరలో ప్రారంభం అంటుంటే, ఈ కోరిక ఏంటి అనుకుంటున్నారా? దీనంతటికి కారణం రాజమౌళినే అని సమాచారం. అవును రాజమౌళి సినిమాల సెంటిమెంట్‌ ఎక్కడ చరణ్‌కు దెబ్బ కొడుతుందా అని ఫ్యాన్స్‌ భయపడుతున్నారు. రీసెంట్‌గా రాజమౌళి ట్రాక్‌ రికార్డ్‌ చూస్తే అలానే అనిపిస్తోంది మరి. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ అనే విషయం తెలిసిందే.

అలాంటి సెంటిమెంట్లలో ‘రాజమౌళి సినిమా హీరోకు వెంటనే ఫ్లాప్‌ ఖాయం’ ఒకటి. దీనిపై రాజమౌళి ఒక జోకు కూడా వేసుకున్నారు. ఆ సెంటిమెంట్‌ని మరోసారి నిజం చేస్తూ రామ్‌చరణ్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్‌ పడింది. దీంతో ఇప్పుడు తారక్‌ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. తారక్‌కు అలాంటి ఫ్లాప్‌ రావొద్దు అని కొందరు అనుకుంటుంటే.. ఇంకొందరేమో అది కొరటాల శివ సినిమాతో వద్దు అంటున్నారు. సెంటిమెంట్‌ను తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని చెబుతారు. ఇండస్ట్రీలో చాలా తక్కువమందే ఇలాంటి సెంటిమెంట్ల నుండి బయటపడ్డారు.

అలా ఎన్టీఆర్‌ బయటపడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఎందుకంటే కొరటాల శివ సినిమా మీద తారక్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ‘జనతా గ్యారేజ్‌’ లాంటి సినిమా ఇచ్చిన కొరటాల ఇప్పుడు తారక్‌కు అంతకుమించిన విజయం ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మొన్నీ మధ్య కథ అద్భుతంగా ఉంటుందని, పెద్ద విజయం పక్కా అంటూ కొరటాల చెప్పారు కూడా. ఇలాంటి సమయంలో కొరటాల శివ సినిమాకు ‘రాజమౌళి సెంటిమెంట్‌’ టచ్‌ అయితే ఇబ్బందులు తప్పవు అని భావిస్తున్నారు నెటిజన్లు.

దీని గురించే మీమ్స్‌ లాంటి బయటికొస్తున్నాయి. అయితే రీసెంట్‌గా ఫ్లాప్‌ వచ్చిన డైరక్టర్‌తో సినిమా చేస్తే తారక్‌ హిట్‌ కొడతాడు అనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ‘నాన్నకు ప్రేమతో’ ‘అరవింద సమేత’, ‘జై లవకుశ’ అలా వచ్చిన విజయాలే. ఇప్పుడు కొరటాల ‘ఆచార్య’ ఫ్లాప్‌ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. చూద్దాం ఏ సెంటిమెంట్ గెలుస్తుందో.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus