కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఈ విషయంలో కొంత మెరుగ్గానే ఉన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన సినిమాలు సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా జులై నెల కలిసిరాకపోయినా ఆగష్టు నెలలో విడుదలైన సినిమాలు కలిసొస్తున్నాయి. ఆగష్టు తొలి వారంలో బింబిసార, సీతారామం సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ అటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు లాభాలను అందిస్తుండటం గమనార్హం. తాజాగా థియేటర్లలో విడుదలైన కార్తికేయ2 సినిమా కూడా పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
అటు బుకింగ్స్ విషయంలో ఇటు కలెక్షన్ల విషయంలో కార్తికేయ2 అదుర్స్ అనిపిస్తోంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాగా ఈ మూడు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ విధంగా ఒకే సమయంలో మూడు హిట్ సినిమాలతో కళకళలాడుతున్న ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కావడం గమనార్హం. ప్రస్తుతం టాలీవుడ్ కు మాత్రమే ఈ ఘనత సొంతమైందని చెప్పవచ్చు. ఈ నెలలో విడుదల కానున్న లైగర్ సినిమా కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాను త్వరగా హిందీలో రిలీజ్ చేస్తే బాలీవుడ్ కు మరో షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బింబిసార మూవీని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బింబిసార మూవీని బాలీవుడ్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.