Mahesh Babu, Rajamouli: రాజమౌళి మూవీ అంటే అలా మారక తప్పదా?

ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వరుస విజయాల దర్శకుడు రాజమౌళి మహేష్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తెరకెక్కిస్తారని మహేష్ బాబు అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే జక్కన్న సినిమాలో నటించాలంటే మహేష్ బాబు కొన్ని త్యాగాలు చేయాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే రీషూట్స్ తప్పవు. తను అనుకున్న విధంగా సీన్ వచ్చేవరకు జక్కన్న అస్సలు రాజీ పడరు.

Click Here To Watch NOW

ఇప్పటివరకు నటించిన సినిమాలలో మహేష్ బాబు ఎక్కువగా స్టైలిష్ గా కనిపించారనే సంగతి తెలిసిందే. అయితే జక్కన్న సినిమాలలో హీరోలు శారీరకంగా ఎంతో కష్టపడాలి. విలన్ల చేతిలో దెబ్బలు తినడంతో పాటు విలన్లకు ధీటుగా జవాబు ఇచ్చేలా ఉండాలి. పెర్ఫెక్షన్ కోసం జక్కన్న హీరోలను ఓ రేంజ్ లో ఇబ్బంది పెడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే జక్కన్న సినిమాల ద్వారా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దక్కుతుంది.

రాజమౌళితో సినిమా అంటే వేరే క‌మిట్మెంట్లు పెట్టుకోకూడదు. షూటింగ్ ఆలస్యమైనా రిలీజ్ డేట్లు మారినా ఓపికతో వ్యవహరించాలి. మహేష్ రాజమౌళి కోసం ఈ త్యాగాలకు సిద్ధమవుతారేమో చూడాల్సి ఉంది. అయితే మహేష్ సైతం ఒక్కసారి కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దర్శకుని పనిలో వేలు పెట్టరు. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఏ విధంగా కనిపిస్తారో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని అందుకుంటుందేమో చూడాల్సి ఉంది.

రాజమౌళి సినిమాతోనే మహేష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూటింగ్ ఈ ఏడాదే మొదలై 2024 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus