Manchu Vishnu: ఈ అంశాల పైనే విష్ణు ఫోకస్ పెట్టాలట..!

మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయని ప్రకాష్ ప్యానల్ అయిన సిని’మా’ బిడ్డలు ఆరోపిస్తూ అందరూ ఏకాభిప్రాయంతో రాజీనామాలు చేసేసారు. అయితే మంచు విష్ణు తాను ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలని.. వాటికి ఎలాంటి భంగం కలిగించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్పుకొచ్చారు. ‘పోస్టల్‌ బ్యాలెట్‌లో ఏదో ఫ్రాడ్ జరిగిందని కూడా వారు చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చి ఏదో స్కామ్ చేశారనే అనుమానం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.

రాత్రికి రాత్రే ఫలితాలు మారడం ఏ మాత్రం నమ్మేలా లేదని కూడా వారు ఆరోపించారు. అయితే వీటి పై విష్ణు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఆయన తక్షణ కర్తవ్యాలు ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. విష్ణు తక్షణ కర్తవ్యాలు కొన్ని ఉన్నాయనేది పెద్దల మాట. అవేంటంటే… ప్రకాష్ ప్యానల్‌తో విష్ణు చర్చలు జరిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎటువంటి ఇగోలు పెట్టుకోకుండా ఈ స్టెప్ తీసుకోవాల్సిందే. ఒకవేళ కాదు అంటే వాళ్ళ రాజీనామాలు ఆమోదించాలి.

ప్రకాష్‌ ప్యానల్ నుండీ గెలిచిన వాళ్ళలో శ్రీకాంత్‌, బెనర్జీ, ఉత్తేజ్ వంటి వారు కీలక పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో 8మంది ఈసీ మెంబర్లుగా ఉన్నారు కాబట్టి… వీళ్ళ రాజీనామాలు కూడా ఆమోదిస్తే.. విష్ణు కొత్త సభ్యులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీళ్ళను విష్ణు ఎలా ఎంపిక చేసుకుంటారు. ప్రకాష్ ప్యానల్‌ పై ఓడిపోయిన వాళ్ళని తీసుకుంటారా.. లేక కొత్త వాళ్ళని తీసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus