Manchu Vishnu: ఆ విమర్శలకు విష్ణు చెక్ పెడతారా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన మంచు విష్ణు రెండు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో మెగా ఫ్యామిలీ సభ్యులను పిలవలేదా? లేక పిలిచినా మెగా ఫ్యామిలీ హీరోలు ఈ వేడుకకు హాజరు కాలేదా? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అలయ్ బలాయ్ కార్యక్రమంలో పవన్, విష్ణు మాట్లాడుకోలేదని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలను విష్ణు ఖండించారు.

పవన్ కళ్యాణ్ తో తాను మాట్లాడానని విష్ణు చెప్పడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోలను విష్ణు పిలిచారా? లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. మెగా హీరోల ఫ్యాన్స్ నుంచి ఈ విషయానికి సంబంధించి విష్ణుకు ట్రోల్స్ ఎదురవుతున్నాయి. విష్ణు స్పందించి వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెడతారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ప్రకాష్ రాజ్ నుంచి విష్ణుపై పరోక్షంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సైతం రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్యానల్ విషయంలో విష్ణు ఏ విధంగా ముందుకు వెళతారో చూడాల్సి ఉంది. మరోవైపు విష్ణు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సులువైన విషయం కాదు. ఆ హామీలను విష్ణు ఏ విధంగా నెరవేరుస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు మంచు విష్ణు ఢీ అండ్ ఢీ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus