మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నట్టు ఇప్పటికే ప్రకటన వెలువడింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండవచ్చని వార్తలు వస్తుండగా సీనియర్ నరేష్ విష్ణుకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ కు 150 మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మద్దతు ఉండగా వాళ్ల ఓట్లు ఖచ్చితంగా విష్ణుకు పడే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతు ఉండటంతో చిరంజీవి మద్దతు కూడా ఆయనకే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చును తనే భరిస్తానని చెప్పడం విష్ణుకు ప్లస్ అవుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే సమయానికి స్థలాన్ని ఫైనల్ చేయాలని విష్ణు భావిస్తున్నారు. మరోవైపు సీనియర్ నరేష్ ప్రకాష్ రాజ్ గెలవకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి అధ్యక్షునిగా ఎంపికైన తర్వాత వృద్ధాప్య పెన్షన్ ను భారీగా పెంచారు.
తన సొంత డబ్బులతో సీనియర్ నరేష్ కొంతమందిని ఆదుకున్నారు. వాళ్ల ఓట్లు కూడా విష్ణుకు పడే అవకాశాలు ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంఖ్య 900 లోపే కావడంతో నరేష్ 150 ఓట్లు విష్ణుకు పడితే మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధ్యక్ష పదవికి ఎవరు ఎంపికవుతారో అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.