Nagarjuna: ఆ సెంటిమెంట్ ను నాగ్ బ్రేక్ చేస్తారా?

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా 14వ తేదీన రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుంది. పండుగకు విడుదలవుతున్న పెద్ద సినిమా బంగార్రాజు మాత్రమే కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. సంక్రాంతి పండుగకు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు విడుదలై ఉంటే ప్రేక్షకులకు ఆ సినిమాలే ఫస్ట్ ఛాయిస్ గా నిలిచే అవకాశం ఉండేది. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన నాగార్జున బంగార్రాజు సినిమాతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాననే నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని వరుస ఫ్లాపులకు బ్రేక్ పడుతుందని నాగ్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ల విషయంలో ఇప్పట్లో ఆంక్షలు అమలు చేయబోమని మంత్రి తలసాని ఇప్పటికే వెల్లడించారు. మంత్రి చేసిన ప్రకటన వల్ల బంగార్రాజు సినిమాకు మేలు జరగనుందని చెప్పవచ్చు. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు, తక్కువ టికెట్ రేట్ల అమలు వల్ల నిర్మాతలకు కొంతమేర నష్టం తప్పదు. కరోనా కేసులు పెరగకపోతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

కరోనా కేసులు తక్కువగా ఉంటే ఫ్యామిలీస్ సైతం బంగార్రాజు సినిమాపై ఆసక్తి చూపి ఛాన్స్ అయితే ఉంది. మాస్, క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా బంగార్రాజు సినిమా ట్రైలర్ ఉంది. మరోవైపు 2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇందువదన, 1945, అతిథిదేవోభవ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. బంగార్రాజు సినిమాతో ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సిన బాధ్యత నాగార్జున, నాగచైతన్యపై ఉంది. బంగార్రాజు సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.

కళ్యాణ్ కృష్ణ నేల టికెట్ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన సినిమా ఈ సినిమానే కావడం గమనార్హం. తక్కువ సమయంలోనే కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు షూటింగ్ ను పూర్తి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus