సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 13వ తేదీన సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదల కానుండగా నా సామిరంగ మూవీ ఈ నెల 14వ తేదీన రిలీజ్ కానుంది. వెంకీ, నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇదే తొలిసారి కాదు. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం దాదాపుగా ఒకే స్థాయిలో ఉంది. 1989 సంవత్సరంలో వెంకటేశ్ నటించిన ప్రేమ, నాగార్జున నటించిన విజయ్ సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి.
ఈ రెండు సినిమాలలో ప్రేమ సినిమా సక్సెస్ సాధించగా విజయ్ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. 1992 సంవత్సరంలో వెంకటేశ్ నటించిన చంటి, నాగ్ నటించిన కిల్లర్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో చంటి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవగా కిల్లర్ సినిమా మాత్రం యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. చాలా సంవత్సరాల తర్వాత సైంధవ్, నా సామిరంగ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
నాగ్, (Nagarjuna) వెంకీలకు సంక్రాంతి సినిమాల ద్వారా బిగ్గెస్ట్ హిట్లు దక్కాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
సంక్రాంతి సినిమాలు కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గుంటూరు కారం, హనుమాన్ సినిమాలపై సైతం వేరే లెవెల్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతి సినిమాలు 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. సంక్రాంతి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!