స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజైంది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల వల్ల ఏపీలో ఈ సినిమాకు బెనిఫిట్ షోలు ఉండవని చాలామంది భావించారు. చాలా సంవత్సరాల నుంచి ఏపీలో బెనిఫిట్ షోల సాంప్రదాయం కొనసాగుతోంది. ఏపీలోని తిరుపతిలో ఉన్న మెజారిటీ థియేటర్లలో అఖండ బెనిఫిట్ షోలు ప్రదర్శితమయ్యాయని తెలుస్తోంది. థియేటర్ల ఓనర్లు అనుమతులు తెచ్చుకుని ఈ షోలను ప్రదర్శించారని బోగట్టా.
ఏపీలోని ఇతర ప్రాంతాల్లో కూడా బెనిఫిట్ షోలు, అదనపు షోలు ప్రదర్శించారని సమాచారం. బెనిఫిట్ షోలకు అనుమతులు లభిస్తే పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే భీమ్లా నాయక్ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు, అదనపు షోలకు అనుమతులు లభిస్తాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ సినిమా రిలీజైన సమయంలోనే ఏపీ ప్రభుత్వం టికెట్ల జీవోను తెరపైకి తెచ్చింది.
వకీల్ సాబ్ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఏపీలో ప్రదర్శించబడలేదు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఇతర హీరోల సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చి పవన్ సినిమాకు అనుమతులు ఇవ్వకపోతే ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2022 సంవత్సరం జనవరి నెల 12వ తేదీన భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 110 కోట్ల రూపాయల బడ్జెట్ తో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది.
Most Recommended Video
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!