తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలక్షన్ల సునామీ సృష్టించిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అనేక రికార్డులను తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. వాటిని అందుకోవడానికి అనేక చిత్రాలు ప్రయత్నించినప్పటికీ చేరుకోలేకపోయాయి. సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 అనేక చోట్ల బాహుబలి 1 రికార్డులను బద్దలు కొట్టింది. తక్కువ వసూలు వచ్చే ఉత్తరాంధ్ర లో చిరు సినిమా 13 కోట్లు రాబట్టింది. ఇక్కడ ప్రభాస్ చిత్రం 9 కోట్లు వసూలు చేసింది.
దీనిని అప్పట్లో అత్యధిక కలక్షన్స్ గా ట్రేడ్ వర్గాల వారు చెప్పారు. ఆ మార్క్ రీచ్ కావడం కుదరదని అన్నారు. వారి అంచనాలను చిరు బద్దలు కొట్టారు. ప్రభాస్ కి కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 28 న థియేటర్లలోకి రానున్న బాహుబలి కంక్లూజన్ చిరు సాధించిన రికార్డ్ ని బద్దలు కొడుతుందో.. లేదో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.