Prashanth Neel: ప్రభాస్‌ – ప్రశాంత్‌ సినిమా.. దిల్‌ రాజు అలా చెప్పారేంటి? అంతా ఓకేనా?

ఓ దర్శకుడు ఒకే రకమైన సినిమాలు చేయాలని ఎక్కడా లేదు. అయితే అన్ని రకాల సినిమాలు చేయాలని ఆయనకూ ఉంటుంది. అలాంటి సినిమా తీస్తే చూడాలని అతని అభిమానులకు కూడా ఉంటుంది. అయితే ఎవరు ఎందులో ది బెస్ట్‌ అయితే అలాంటి సినిమానే చేయాలని అనుకుంటారు. అందులోనే మంచి హిట్లు ఇవ్వాలని కూడా ఆశిస్తున్నారు. అలాంటి సమయంలో ప్రయోగం చేస్తాను అంటే.. ఆ దర్శకుడు అభిమానులు ఇబ్బందిపడతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఎవరు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఇంకెవరు ప్రశాంత్‌ నీల్‌.

అవును, మీరు చదివింది కరెక్టే. ప్రశాంత్‌ (Prashanth Neel) – ప్రభాస్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల ప్రకారం దిల్‌ రాజు ఈ సినిమాను ప్రకటించారు కూడా. ‘సలార్‌’ సినిమా తర్వాత ప్రభాస్‌ – నీల్‌ మరోసారి సినిమా చేస్తారని, అది తన బ్యానర్‌లోనే ఉంటుందని దిల్‌ రాజు చెప్పారు. అయితే ఇక్కడే సమస్య వచ్చిపడింది. అదే.. ఈ సినిమా జోనర్‌. ప్రశాంత్‌ నీల్‌ స్పెషాలిటీ నుండి బయటికొస్తూ.. పౌరాణికంలో ఈ సినిమా చేస్తున్నారని కూడా చెప్పారు.

దీంతోనే చర్చ మొదలైంది. ‘కేజీయఫ్‌’ సినిమాలతో పాన్‌ ఇండియా డైరక్టర్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌.. తొలుత నుండి ఇలాంటి మాస్‌ యాక్షన్‌ సినిమాలే చేస్తూ వస్తున్నారు. ‘ఉగ్రం’తో ఆయన కెరీర్‌ మొదలైంది. అది మాస్‌ సినిమా అనే విషయం తెలిసిందే. ఇప్పుడు చేస్తున్న ‘సలార్‌’ కానీ, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసే సినిమా కానీ మాస్‌ యాక్షన్‌ సినిమానే. అలాంటిది ప్రశాంత్‌ నీల్‌ పౌరాణికం చేయాలని అనుకోవడం ఏంటి అనే చర్చ నడుస్తోంది.

ఇదంతా ఎందుకు అంటే.. ఆయన సినిమాల్లో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ అంత ఫేమస్‌. అవి చూసే అతనితో పని చేయడానికి ఇండియాలోని టాప్ స్టార్లు పోటీ పడుతున్నారు. దీంతో పౌరాణికం ఆ రేంజిలో ఎలివేషన్లు, యాక్షన్‌ ఉంటాయా అనేది డౌటానుమానంగా మారింది. అయితే ఇక్కడ ముద్రవేసినట్లే అక్కడ కూడా ప్రశాంత్‌ నీల్‌ ముద్ర వేస్తారేమో చూడాలి. ఇక ‘బాహుబలి’ సినిమాల్లో రాజు పాత్రలో అదరగొట్టిన ప్రభాస్‌కు పౌరాణిక చిత్రం పెద్ద విషయమేమీ కాదు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus