ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ఎక్కువగా అక్కడ రీమేక్ సినిమాలే రూపొందుతుంటాయి అని కొందరు భావిస్తూ ఉండేవారు. పైగా బెంగళూరు వంటి ఏరియాల్లో అన్ని భాషల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల కన్నడ సినిమాలని అక్కడి ప్రేక్షకులే పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘కేజీఎఫ్’ అనే సినిమా వచ్చి.. కన్నడ సినిమా రూపురేఖల్ని మార్చేసింది. ఆ తర్వాత కూడా ‘విక్రాంత్ రోణ’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి.
Bagheera
అయితే ‘కాంతార’ అనే సినిమా కన్నడ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అందుకే తెలుగులో కూడా కన్నడ సినిమాలకి డిమాండ్ పెరిగింది. త్వరలో ‘బఘీర’ (Bagheera) అనే సినిమా రాబోతుంది. ‘కేజీఎఫ్’ ‘కాంతార’ ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన ‘హోంబలే ఫిలింస్’ అధినేత విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఆ రోజున ‘లక్కీ భాస్కర్’ ‘క’ వంటి క్రేజీ సినిమాలు ఉన్నప్పటికీ.. ‘బఘీర’ ని తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందించారు. స్క్రీన్ ప్లే కూడా అందించారనే టాక్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిజం ఉంటుంది.’హంబలే..’ వాళ్ళు ఖర్చుకి వెనకాడకుండా సినిమాలను నిర్మిస్తారు.
‘బఘీర’ (Bagheera) టీజర్లో హీరోయిజంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కనిపించాయి. ‘ఉగ్రం’ ఫేమ్ శ్రీ మురళి ఇందులో హీరోగా నటించిన సినిమా ఇది..! టాక్ కనుక ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా.. రెండో రోజు నుండి సినిమా కుమ్మేయడం ఖాయంగానే కనిపిస్తుంది.