Pushpa 2: ‘పుష్ప 2’కి ఏదో ఒక అడ్డంకి.. ఇలా అయితే ఈ ఏడాది వస్తాడా?

పెద్ద సినిమా అన్నాక వాయిదాలు సహజం. ఈ మాటను క్యాజువల్‌గా అనేస్తారు కానీ.. ఆ మాట అనడం వెనుక, ఆ పని జరగడం వెనుక చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి ఫీలింగ్‌ను వరుసపెట్టి ఫీల్‌ అవుతున్న ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) టీమ్‌ మరోసారి అదే పని చేయబోతోందా? ఇప్పుడు టాలీవుడ్‌లో, టాలీవుడ్‌ మీడియాలో ఇదే విషయం గురించి చర్చ జరుగుతోంది. దానికి కారణం సినిమా షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి అంటున్నారు.

ఆగ‌స్టు 15న విడుదల కావాల్సిన ‘పుష్ప: ది రూల్‌’ సినిమా డిసెంబ‌రుకి వెళ్లిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. అప్పటి నుండి షూటింగ్ న‌త్త న‌డ‌కగా సాగుతోంది అని చెబుతున్నారు. ఈవారంలో ఓ భారీ యాక్ష‌న్ సీన్ ప్లాన్ చేశారని టాక్‌. అయితే సినిమాలో టీమ్‌లో కీలక సిబ్బంది ఒకరికి అనారోగ్యం వచ్చిందట. దీంతో షూటింగ్‌ వాయిదా వేశారట. ఇప్పుడు సుకుమార్‌  (Sukumar) విదేశాలకు ట్రిప్‌కు వెళ్లారని చెబుతున్నారు.

మరికొందరేమో సుకుమార్‌కి కూడా కాస్త హెల్త్‌ అప్‌సెట్‌ అయిందని అని చెబుతున్నారు. ఈ లెక్కన సినిమా రిలీజ్‌కి నాలుగు నెలలు ఉంది. మరి ఈ గ్యాప్‌లో షూటింగ్‌ పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసి రిలీజ్‌కి రెడీ చేయగలరా అనేది ప్రశ్న. మామూలుగానే సుకుమార్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారని ఓ టాక్‌. ఇక ఇంత పెద్ద సినిమాను కనీసం నెల రోజులు ప్రచారం చేయాలి. కాబట్టి డిసెంబరు రిలీజ్‌ ఓకేనా? అనేదే ప్రశ్న.

‘పుష్ప: ది రైజ్‌’ సినిమా విషయంలోనూ ఇలానే జరిగిందనే విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ సినిమాను రిలీజ్‌కు ముందు రోజు వరకు కొన్ని మార్పులు, చేర్పులు చేశారట. ఈ నేపథ్యంలో సుకుమార్‌ ప్రచారం కోసం కూడా ఆయన ముందు రోజు వరకు రాలేదు. దీంతో అల్లు అర్జున్‌ (Allu Arjun)  , దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad)  , రష్మిక మందననే (Rashmika) ప్రచార బాధ్యతలు పోషించారు. ఈ సారి ఎలాగైనా డిసెంబరులో సినిమా తెచ్చేయాలంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది అని అంటున్నారు నెటిజన్లు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus