Pushpa 2: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటని ‘పుష్ప 2’ టీం వింటుందా?

ఒకప్పటిలా ఇప్పుడు సినిమాలు లాంగ్ రన్ నిలబడట్లేదు. కొన్ని లాంగ్ రన్ పడుతున్నాయి. కానీ కచ్చితంగా అవి లాంగ్ రన్ నిలబడతాయి అనే కాన్ఫిడెన్స్ మేకర్స్ లో అయితే కనిపించడం లేదు. అందుకే తక్కువ టైంలోనే ఓటీటీ రిలీజ్ కి అంగీకారం తెలుపుతున్నారు. ఓటీటీ సంస్థలు ఒకటి, రెండు కోట్లు ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అంటే చాలు.. తమ సినిమాను అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీకి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు మేకర్స్.

Pushpa 2

‘సలార్’ (Salaar) సినిమా 4 వారాలకే ఓటీటీకి వచ్చేసింది. మహేష్ బాబు (Mahesh Babu)  ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమా కూడా అంతే..! అయితే ఈ పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు… టికెట్ రేట్లు పెంచేసి వీకెండ్ కి లేదంటే మొదటి వారానికి పెట్టిన మొత్తాన్ని వెనక్కి తెచ్చేసుకోవాలని భావిస్తున్నారు. టికెట్ రేట్ల పెంపు వల్ల హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల లాంగ్ రన్ కి ఎఫెక్ట్ అవుతుంది. అయినా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ మారడం లేదు.

ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా హవా మొదలైంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం వల్ల.. భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో నైజాంలో టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకనున్నాయి. మరి ఆంధ్ర సంగతేంటి? అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టికెట్ రేట్ల పెంపుకి ఈజీగా అనుమతి ఇచ్చేస్తుంది. జగన్ ప్రభుత్వంలా కండీషన్స్ వంటివి పెట్టడం లేదు.

కానీ సింగిల్ స్క్రీన్స్ లో రూ.250 కి మించి వద్దు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూచిస్తున్నారట. అయినప్పటికీ పుష్ప నిర్మాతలు సింగిల్ స్క్రీన్స్ లో రూ.300 టికెట్ రేటుకి రిక్వెస్ట్ పెట్టుకున్నారట. మరి అందుకు పవన్ అంగీకారం తెలుపుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

నాగచైతన్య పెళ్లి పత్రికలో ఇది గమనించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus