గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సరైన అప్డేట్స్ లేక ఫ్యాన్స్ కూడా సినిమాపై పెద్దగా హోప్స్ పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఇక 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచినా, సినిమా మీద పెద్దగా బజ్ లేదు. దిల్ రాజు ఇప్పుడు సినిమాకి హైప్ తీసుకురావడానికి కష్టపడుతున్నారు. క్రమంగా అప్డేట్స్ ఇచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాలని భావిస్తున్నారు, ఎందుకంటే భారీ కలెక్షన్ల కోసం మంచి ప్రమోషన్ అవసరం.
Game Changer
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్టార్ట్ ఎనౌన్స్ చేసినప్పుడు శంకర్ బ్రాండ్ ఇమేజ్‌తోనే మంచి హైప్‌ను సంపాదించింది. కానీ, శంకర్ ఇటీవలె హిట్స్ లేకపోవడం, ‘భారతీయుడు 2’ వంటి సినిమా డిజాస్టర్ కావడం ఆయన ఇమేజ్‌ని దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్, ‘గేమ్ చేంజర్’ అవుట్‌పుట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఇప్పుడు గేమ్ ఛేంజర్ ముందున్న టార్గెట్ 5 మిలియన్ డాలర్స్ క్లబ్. ఓవర్సీస్ లో తేజా సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా కూడా ఆ క్లబ్ లో చేరింది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఈ క్లబ్‌లో నాలుగు సార్లు చేరిపోయాడు, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘సలార్’, ‘కల్కి 2898ఏడీ’ సినిమాల ఓవర్సీస్ లో మంచి ప్రాఫిట్స్ అందించాయి.
ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్‌తో కలసి ఈ క్లబ్‌లో చేరాడు, అలాగే ‘దేవర’తో సోలోగా చేరాడు. ‘గేమ్ చేంజర్’ సినిమాతో రామ్ చరణ్ మరలా 5 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రెండు సార్లు ఈ ఫీట్ సాధించిన హీరోగా చరణ్ నిలుస్తాడని వారు నమ్ముతున్నారు. కానీ సినిమాకు ఇప్పుడున్న బజ్ ప్రకారం ఆ టార్గెట్ అందుకోవడం కష్టమే. మరి రాబోయే అప్డేట్స్ ఏమైనా అంచనాలను పెంచుతాయేమో చూడాలి.