Ravi Teja,Srinu Vaitla: రవితేజ శ్రీనువైట్లను నమ్మడం సాధ్యమేనా?

స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీనువైట్ల కోన వెంకట్ తో విడిపోయిన తర్వాత తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. బాద్ షా సినిమా వరకు ఊహించని స్థాయిలో సక్సెస్ రేట్ ఉన్న శ్రీనువైట్ల వరుస ఫ్లాపుల వల్ల ప్రస్తుతం ఏ హీరో నమ్మలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. ఒకప్పుడు శ్రీనువైట్ల డైరెక్షన్ లో నటించాలని ఆశ పడిన హీరోలు సైతం ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే జంకుతున్నారు.

అయితే శ్రీనువైట్లకు స్టార్ హీరో రవితేజ మరో ఛాన్స్ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శ్రీనువైట్ల గత సినిమా అమర్ అక్బర్ ఆంటోని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ప్రస్తుతం రవితేజ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే. రవితేజ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. రవితేజకు ఈ మధ్య కాలంలో క్రాక్ మినహా మిగతా సినిమాలన్నీ షాకిచ్చాయి.

రవితేజ ఒక్కో సినిమాకు భారీస్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నా తర్వాత సినిమాలు సక్సెస్ సాధించకపోతే రవితేజ రెమ్యునరేషన్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. ధమాకా సినిమాపై మాస్ మహారాజ్ ఆశలు పెట్టుకోగా ఈ సినిమా రవితేజ ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

శ్రీనువైట్ల ఇప్పటికే రవితేజకు కథ చెప్పారని సమాచారం అందుతోంది. రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమాకు నిర్మాత దొరుకుతారా అనే ప్రశ్న సైతం వ్యక్తమవుతోంది. అటు రవితేజ ఇటు శ్రీనువైట్ల తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus