ఈ మధ్య కాలంలో చాలామంది డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్నా రాజమౌళిలా ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో గత సినిమాలను మించిన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా మెజారిటీ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ కు క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా కుంభస్థలాన్ని బద్ధలుగొడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కేజీఎఫ్2 మూవీ థియేటర్లలో విడుదలయ్యే వరకు ఆర్ఆర్ఆర్ కు పోటీ లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్2 ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో టికెట్లు దొరకక ఎక్కువమంది ఆర్ఆర్ఆర్ సినిమా చూడటాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఫస్ట్ వీక్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరకడం సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
చరణ్, తారక్ మూడున్నరేళ్ల కష్టానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రతిఫలం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హీరోలు తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ ఊహించని స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంది. చరణ్, తారక్ లకు నటులుగా ఎటువంటి వంకలు పెట్టలేమనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి మ్యాజిక్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమాసినిమాకు దర్శకుడిగా జక్కన్న తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్నో ఆవాంతరాలను దాటుకుని థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. చరణ్ తారక్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ సాధించడానికి కారణమైంది.