స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి రేయింబవళ్లు పడిన కష్టం అంతాఇంతా కాదు. స్టూడెంట్ నంబర్1 నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ప్రతి ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ స్థాయిని సొంతం చేసుకోవడం కోసం గమనార్హం. అయితే రాజమౌళి తన సినిమాకు ఫాలో అయ్యే మార్కెటింగ్ స్ట్రాటజీలు అన్నీఇన్నీ కాదు. ప్రభాస్ ఒక సందర్భంలో బాహుబలి1 సినిమాకు చేసిన స్థాయిలో తన కెరీర్ లో ఏ సినిమాకు ప్రమోషన్స్ చేయలేదని చెప్పారు.
ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం చరణ్, తారక్ పడిన కష్టం అంతాఇంతా కాదు. అయితే చాలామంది డైరెక్టర్లు రాజమౌళిలా భారీ సినిమాలను తెరకెక్కిస్తున్నా ప్రమోషన్స్ విషయంలో మాత్రం తడబడుతున్నారు. తమ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. రాజమౌళికి స్థాయికి రావాలంటే జక్కన్న స్థాయిలో పని చేయాలి. కొంతమంది నిర్మాతలు సినిమాల కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నా ప్రమోషన్స్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదు.
ఈ రీజన్ వల్లే తెలుగులో భారీ సక్సెస్ సాధించిన సినిమాలు ఇతర భాషల్లో పాజిటివ్ ఫలితాలను అందుకోవడంలో ఫెయిలవుతున్నాయి. ఓటీటీల హవాతో ప్రస్తుతం హిట్ టాక్ వచ్చిన సినిమాలను రీమేక్ చేసే పరిస్థితి కూడా లేదు. అదే సమయంలో పాన్ ఇండియా సినిమాలను అన్ని భాషల్లో ఒకే సమయంలో రిలీజ్ చేస్తే మంచిది. వేర్వేరు డేట్లలో రిలీజ్ చేయడం వల్ల సినిమాలపై ఆసక్తి తగ్గుతోంది.
కొన్నిసార్లు ఒక భాషలో రిలీజైన సినిమాలు ముందుగానే ఓటీటీలో విడుదలవుతూ ఉండటంతో ఇతర బాషల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నసంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమాలను నిర్మించాలని పలు మల్టీ నేషనల్ కంపెనీలు సైతం ప్లాన్ చేస్తున్నాయని అయితే ఆ ఆఫర్లకు (Rajamouli) జక్కన్న ఓకే చెప్పడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా