సినిమా పరిశ్రమకు ఉన్న అనేక సినిమా కష్టాల్లో విడుదల ఒకటి. మొత్తం సినిమా సిద్ధం చేసుకొని కొందరు, షూటింగ్ 80-90 శాతం పూర్తి చేసుకొని ఆపేసి ఇంకొందరు నిర్మాతలు, సగం సినిమా అయ్యక ఆగిన వారు కొందరు. ఇలా ఏటా చాలా సినిమాల విడుదల ఆగిపోతూ ఉంటుంది. దీనికి టాలీవుడ్ కూడా ఏం అతీతం కాదు. మన దగ్గర ఏటా 250 – 300 సినిమాలు సిద్ధమవుతూ ఉంటాయి. అయితే అందులో విడుదలయ్యే వాటి సంఖ్య తక్కువే. ఇటీవల కాలంలో ఇది ఇంకా తక్కువైంది. అయితే ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి పక్కనే ఉన్న తమిళ చిత్రపరిశ్రమ ఓ ఆలోచన చేస్తోందట.
గతంలో అంతా సిద్ధమయ్యాక… విడుదలకు నోచుకోని కొన్నిసినిమాలు ముఖ్యంగా చిన్న సినిమాలు టీవీల్లోకి వచ్చేసేవి. దాంతో కనీసం అలా అయినా సినిమా విడుదలవుతుంది అని నిర్మాతలు ముందుకొచ్చేవారు. కొన్నిసార్లు థియేటర్ల విడుదలైన రెండు, మూడు రోజులాడినా టీవీ హక్కుల ద్వారా బాగానే వస్తుంది అనుకునేవారు. అయితే ఇప్పుడు టీవీల ప్లేస్‌లోకి ఓటీటీ వచ్చేసింది. దీన్ని వాడుకునే తమిళ చిత్రపరిశ్రమ… నిర్మాతలకు మంచి చేయాలని చూస్తోంది. అవును కోలీవుడ్ నిర్మాతల మండలి ఓ ఓటీటీని ఏర్పాటు చేయాలని చూస్తోందట.
2015 నుండి ఇప్పటివరకు షూటింగ్ పూర్తయి, విడుదలకు నోచుకోని సినిమాల జాబితాను సేకరిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తవ్వకముందే కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. ఆ వివరాలు కూడా సేకరిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే ఓటీటీ ద్వారా ఈ సినిమాలన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఆయా సినిమాల ఆదాయాన్ని ఆ నిర్మాతలకే అందేలా చేస్తారట. ఈ ఆలోచనపై మన నిర్మాతల మండలి కూడా ఓ లుక్కెయ్యాల్సి ఉంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!