మెగాస్టార్ చిరంజీవి చూడని విజయాలు అంటూ లేవు.సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు.. ‘ఖైదీ’ తో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. సౌత్ లో 5 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఏకైక హీరోగా చిరు రికార్డు సృష్టించారు. ఇప్పటికీ ఆ రికార్డుని ఏ హీరో బ్రేక్ చేయలేదు. భవిష్యత్తులో కూడా ఆ రికార్డు బ్రేక్ అవుతుందా? అనే సందేహాలు కూడా అందరిలోనూ ఉన్నాయి.
అయితే చిరు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న సినిమాల లిస్ట్ లో ‘ఇంద్ర’ కూడా ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో చిరు నటించిన ఈ మూవీ 2002 లో రిలీజ్ అయ్యి రూ.28 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. ఆ సినిమా 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇది కూడా ఓ రికార్డు గా చెప్పుకోవాలి. ఆ తర్వాత చిరు నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రం 135 రోజుల వరకు కొన్ని కేంద్రాల్లో ఆడింది.
175 రోజుల వరకు ఆ సినిమా ఆడలేదు. అంతేకాదు ఆ తర్వాత చిరు నటించిన ఏ సినిమా కూడా 175 రోజుల వరకు ప్రదర్శింపబడింది లేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా మాత్రం ఓ చోట 175 రోజుల వరకు ఆడింది. ఇంకా అడుగుతూనే ఉంది. ఎక్కడ అంటే..
ఆంధ్రప్రదేశ్ కి చెందిన కృష్ణా ఏరియాలో అవనిగడ్డ ప్రాంతంలో రామకృష్ణ థియేటర్ లో రోజుకి 4 షోలతో ఈ సినిమా అక్కడ 175 రోజులు ప్రదర్శింపబడుతోంది. 200 రోజులు వైపుగా కూడా పరుగులు తీస్తుంది అని చెప్పొచ్చు. 21 ఏళ్ళ తర్వాత చిరు.. ఈ ఫీట్ సాధించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.