టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన మెగా స్టార్ చిరు, పాలిటిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ పెద్దగా కలసి రాకపోవడంతో మళ్లీ చివరకు ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు. అయితే తన 150వ సినిమాను దాదాపుగా రెండేళ్ల ముందే ప్రకటించి ఈ మధ్యనే మొదలు పెట్టి మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే చిరు 150వ సినిమా కోసం ఎందరో రచయితలు ఎన్నో కధలు రెడీ చేసిన చిరు మాత్రం సాంబార్ వాసనే నచ్చినట్లుగా తమిళ సినిమా కత్తి పైనే ఆశలు పెట్టుకుని ఆ సినిమానె కొని రీమేక్ చేసుకుంటున్నాడు. అయితే ఆ మ్యాటర్ అంతా పక్కన పెడితే చిరు పై గతంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కధ అందించిన స్టార్ రైటర్ “చిన్ని కృష్ణ” సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరు కధ కావాలి అని కోరడంతో చిన్ని కృష్ణ “గ్రాండియర్’ అనే మంచి కధ ఒకటి తయారు చేసి చిరు వద్దకు తీసుకెళ్లినా…. ఆ కథ నచ్చక పోవడంతో చిరు తమిళ సినిమా ‘కత్తి’ బాగుంది అంటూ ఆ సినిమాను రీమేక్ చేసుకుంటున్నాడు అని అయితే తాను చెప్పిన కథను చిరంజీవి నమ్మకపోయినా తనకు బాధ లేదు అని అంటూ ‘కత్తిలాంటోడు’ పై ఒక సెటైర్ వేసాడు చిన్ని కృష్ణ.
అదే క్రమంలో తాను వ్రాసిన కథ చిరంజీవికి నచ్చక పోవడం అది చిరంజీవి వ్యక్తిగత నిర్ణయం అని అంటూనే అదే క్రమంలో యంగ్ హీరోలపై కూడా ఒక రౌండ్ వేసుకున్నాడు మన స్టార్ రైటర్….యువ హీరోల గురించి మాట్లాడుతూ…నేటి తరం యంగ్ హీరోలు అంతా యంగ్ రైటర్స్ వ్రాసిన స్క్రిప్ట్ లకు ఇష్టపడుతున్నారని వారికి యంగ్ డైరెక్టర్స్ యంగ్ హీరోయిన్స్ కావాల్సిన నేపధ్యంలో తన లాంటి సీనియర్ రైటర్స కు స్థానం ఎక్కడా ? అని అంటూ యంగ్ హీరోలపై కూడా ఒక రౌండ్ వేసుకున్నాడు మన రైటర్. ఇలా అవకాశం దొరకడంతో అందరినీ ఒక రౌండ్ వేసుకున్నాడు మన రచయిత. మరి దీనిపై ఎలాంటి కౌంటర్స్ వినిపిస్తాయో చూడాలి.