రాజమౌళి సినిమాలలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ తరచూ కనిపిస్తూ ఉంటాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ రాజమౌళి తెరకెక్కించిన మూడు సినిమాలలో కామన్ గా కనిపించారు. విక్రమార్కుడు, యమదొంగ మరియు మర్యాద రామన్న చిత్రాలలో ఈ చైల్డ్ ఆర్ట్స్ నటించడం జరిగింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనే కదా మీ డౌట్. ఆ మూడు చిత్రాల లో బాలనటుడిగా నటించింది ఎవరో కాదు రాజమౌళి అన్నగారైన కీరవాణి కుమారుడు శ్రీ సింహ. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్న కీరవాణి కొడుకు కావడంతో రాజమౌళి తన సినిమాలలో తనని నటింపజేశారు.
విక్రమార్కుడు సినిమాలో మార్వాడి పెళ్లి ఇంటిలో అల్లరి చేసే పిల్లలలో ఒకరిగా శ్రీ సింహ నటించడం జరిగింది. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర చేశాడు. లిటిల్ దొంగగా శ్రీ సింహ నటన ఆ చిత్రంలో ఆకట్టుకుంది. ఆ తరువాత సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రంలో కూడా శ్రీ సింహ మెరిశాడు. నాగినీడు ఇంటికి దారిచూపే రాయలసీమ కుర్రాడిగా శ్రీసింహ కనిపించారు.
అప్పటికి ఈ కుర్ర హీరో టీనేజ్ కి రావడం జరిగింది. కాగా ఇటీవల విడుదలైన మత్తువదలరా మూవీతో శ్రీ సింహ హీరోగా మారాడు. అరంగేట్రమే ఓ డిఫరెంట్ మూవీలో నటించి శభాష్ అనిపించాడు. నటుడిగానే కాకుండా సినిమాకు సంబంధించిన అనేక విభాగాలలో శ్రీసింహకు అనుభవం ఉంది. కీరవాణి మరో కొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు.