Yandamuri, Chiranjeevi: చిరంజీవి కళ్లలో ఆప్యాయత.. మెగాస్టార్ ను 50సార్లు కలవాలంటూ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్ పరంగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. విశ్వంభర సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి గురించి మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మెగాస్టార్ యాక్ట్ చేసిన మంచు పల్లకి సినిమాకు డైలాగ్స్ రాశానని ఆయన అన్నారు. మంచు పల్లకి సినిమా తర్వాత మేమంతా 40 సంవత్సరాల పాటు సన్నిహితంగా ఉన్నామని యండమూరి వెల్లడించారు.

చిరంజీవితో విబేధాల గురించి స్పందిస్తూ విబేధాలు అందరి మధ్య వస్తాయని మళ్లీ కలిసిపోతుంటారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని ఏం జరిగిందో కూడా మేమిద్దరం మరిచిపోయామని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత చిరంజీవి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అని నేను భయపడ్డానని చిరంజీవి మాత్రం నన్ను ప్రేమతో పలకరించారని ఆయన తెలిపారు.

చిరంజీవి కళ్లలో ఆప్యాయత కనిపించిందని యండమూరి వెల్లడించారు. ఆ సమయంలో మీ జీవిత చరిత్ర రాస్తే బాగుంటుందని నేనే చిరంజీవిని అడగగా మెగాస్టార్ వెంటనే నువ్వు రాస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందని ఇప్పుడే ప్రకటించమంటావా అని అన్నారని ఆయన పేర్కొన్నారు. నేను వెంటనే ఓకే చెప్పడంతో చిరంజీవి వెంటనే ఆ విషయాలను ప్రకటించారని యండమూరి తెలిపారు. బయోపిక్ రాయాలంటే చిరంజీవి (Chiranjeevi) గారిని కనీసం 50 సార్లు కలిసి మాట్లాడాలని ఆయన చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ బాల్యం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఘటనల గురించి బుక్ రాస్తానని తెలిపారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కలుస్తానని యండమూరి కామెంట్లు చేశారు. చిరంజీవి జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రావాలని ఆయన అభిమానులలో చాలామంది కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus