Yash: ‘టాక్సిక్’ అలాంటి సినిమా కాదంటున్న యశ్.. మరి అలాంటి టీజర్ ఎందుకో?
- April 18, 2026 / 06:39 PM ISTByFilmy Focus Desk
సినిమా ఎలా ఉండబోతోంది? ఎలాంటి అంశాలు చూపించబోతున్నారు? సినిమా నుండి ప్రేక్షకులు ఏం ఆశించొచ్చు లాంటి అంశాలు చెప్పడానికి చిత్రబృందం గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. వాటి ప్రకారం సినిమా కోసం థియేటర్‌కి వెళ్లాలో వద్దో ప్రేక్షకులు నిర్ణయించుకుంటూ ఉంటారు. ఆ వీడియోలు క్లిక్ అయితే సినిమాకు ప్రీరిలీజ్ హైప్ వస్తుంది. అయితే టీజర్‌లో ఒకలా జోనర్‌ని చూపించి.. థియేటర్లలోకి వెళ్లాక వేరే జోనర్‌లో సినిమాను చూపించిన ఉందంతాలు ఉన్నాయి. అవి మిస్ ఫైర్ అయిన పరిస్థితులూ ఉన్నాయి. ఇప్పుడు యశ్ కూడా ఇలానే మాట్లాడుతున్నారు.
Yash
ప్రస్తుతం యశ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అవి రెండూ భిన్న నేపథ్యాలున్న కథలు. నితీశ్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’లో నటిస్తున్న యశ్.. అదే సమయంలో గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన యశ్.. తన రెండు సినిమాల గురించి మాట్లాడాడు. ‘టాక్సిక్’ టీజర్ చూసి చాలామంది ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ కాన్సెప్ట్‌లా ఉంది అని అనుకుంటున్నారని అని, అయితే ఇది అలాంటి సినిమా కాదని స్పష్టం చేశాడు యశ్.

‘టాక్సిక్’ గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. భిన్నమైన ప్రపంచం, కొత్త తరహా కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. నా అభిమానులు నా నుండి ఏం ఆశిస్తున్నారో నాకు తెలుసు. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. గీతూ మోహన్ దాస్ స్పష్టమైన విజన్‌తో ఉన్నారు. యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో బలమైన భావోద్వేగాలకు స్థానం కల్పించారు అని యశ్ చెప్పుకొచ్చాడు. జూన్ 4న ఈ సినిమా రావాల్సి ఉంది.

ఇక ‘రామాయణ’ సినిమాలో పని చేయడం గురించి చెబుతూ ‘‘రణ్‌బీర్ అద్భుతమైన నటుడు. సినిమా విషయంలో మా విజన్, ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు కలిసొచ్చింది. ‘రామాయణ పార్ట్ 1’లో మా కాంబినేషన్‌లో సీన్స్ లేవు అని యశ్ చెప్పాడు. ఎందుకంటే రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి పార్ట్‌లో రాముడి వనవాసం మొదలైన దగ్గర ఆగిపోతుంది అని సమాచారం. ఈ దీపావళికి ఈ సినిమాను తీసుకొస్తామంటున్నారు.
ఒక సినిమానే రిలీజ్ చేయడం లేదు.. మరో ఛాన్స్ కావాలా బుచ్చిబాబు!











