Yash, Rajamouli: యశ్ కోరికను జక్కన్న నెరవేరుస్తారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లతో ఘన విజయాలను అందుకున్న నేపథ్యంలో జక్కన్నకు క్రేజ్, పాపులారిటీ మరింత పెరిగింది. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ హీరో యశ్ కు రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే నటిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు యశ్ సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి తాను సిద్ధమేనని యశ్ చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాతో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న యశ్ తన ఫేవరెట్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరని ఆయనకు ఒక విజన్ ఉందని చెప్పుకొచ్చారు. రాజమౌళి విజన్ ఎలా ఉంటుందో ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలే చెప్పాయని యశ్ అన్నారు.

రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో తను హీరోగా సెట్ అవుతానని అనిపిస్తే తాను ఎందుకు చేయనని యశ్ పేర్కొన్నారు. రాజమౌళి ఏ సినిమాలో ఎవరు హీరోగా సెట్ అవుతారో పెర్ఫెక్ట్ గా ఆలోచిస్తారని యశ్ అన్నారు. రాజమౌళి ఏదైనా పాత్రకు తాను కరెక్ట్ అని భావిస్తే ఆ పాత్ర చేయడానికి తాను సిద్ధమేనని యశ్ క్లారిటీ ఇచ్చారు. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పటికి వస్తుందో చూడాల్సి ఉంది.

రాజమౌళి మాత్రం ఇప్పటివరకు తెలుగు హీరోలు మినహా ఇతర భాషల హీరోలను ఫుల్ లెంగ్త్ రోల్స్ లో పెట్టి సినిమాలను తెరకెక్కించలేదు. రాజమౌళి మహేష్ తర్వాత ఎవరితో సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు జక్కన్న రేంజ్ పెరుగుతుండగా జక్కన్న వేగంగా సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం జక్కన్న స్థాయిలో మరే డైరెక్టర్ రెమ్యునరేషన్ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus