బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందా ? అంటే నిజమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈవారం కేవలం ఐదుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లలో రతిక, యావర్, గౌతమ్, భోలే షవాలి, శివాజీ ఉన్నారు. చాలా వారాల తర్వాత అమర్ నామినేషన్స్ లోకి రాలేదు. అలాగే స్టార్ మా బ్యాచ్ లో మిగిలిన ప్రియాంక – శోభాశెట్టి కూడా నామినేషన్స్ లో లేరు. ఈసారి శివాజీ బ్యాచ్ మొత్తం ఆల్ మోస్ట్ నామినేట్ అయ్యింది. ఇందులో గౌతమ్, రీ ఎంట్రీ ఇచ్చిన రతిక ఇద్దరికే ఇప్పుడు ఎలిమినేషన్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
కానీ, బిగ్ బాస్ ఈవారం ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ అనేది ఇవ్వబోతున్నాడనే అనిపిస్తోంది. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ చెప్తున్నారు ఆడియన్స్. ఈవారం నామినేషన్స్ ని కొత్త ప్రక్రియ ద్వార చేశారు. శోభాశెట్టి కెప్టెన్ కాబట్టి సేఫ్ అయ్యింది. అలాగే రాజమాతగా ఉన్న కారణంగా ప్రియాంక కూడా లక్కీగా నామినేషన్స్ లోకి రాలేదు. ఇక అమర్ ని నామినేట్ చేయబోయిన ప్రిన్స్ యావర్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఇలా సెల్ఫ్ నామినేషన్ కి అస్సలు అవకాశం ఉండదు.
కానీ, బిగ్ బాస్ వేరేవాళ్లని నామినేట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వారిని నేరుగా నామినేషన్స్ లోకి తీసుకుని వస్తాడు. అందుకే, యావర్ తనకి తాను నామినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి యావర్ అమర్ ని నామినేట్ చేద్దామని కత్తి తీశాడు. కానీ, అంతకంటే ముందు శివాజీ అమర్ పేరు చెప్పేశాడు. గేమ్ లో తన భుజం పై ఉన్న బ్యాగ్ ని గట్టిగా లాగాడంటూ నామినేషన్స్ లోకి తెచ్చాడు. దీంతో యావర్ మరెవరినీ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది.
చాలాసేపు రాజమాతల దగ్గర తర్జన భర్జన పడ్డాడు. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. వేరే వాళ్ల పేరు చెప్పకపోతే సెల్ప్ నామినేషన్ లోకి రావాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అందుకే నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇప్పుడు తన గేమ్ ప్లాన్ అది కాదని శివాజీతో చెప్పడం స్టార్ట్ చేశాడు. నిజానికి నేను అమర్ ని టార్గెట్ చేసి ఉంటే, పల్లవి ప్రశాంత్ పేరు చెప్పేవాడ్ని కదా.. ఏదో ఒక సిల్లీ రీజన్ తో చెప్పి చేసేవాడ్ని అప్పుడు రాజమాతలు అమర్ ని చేసేవారు.
కానీ, నేను సెల్ఫ్ నామినేట్ ఎందుకు అయ్యానో తెలుసా, నేను అలా సిల్లీగా ఏది చేయను కాబట్టి అన్నాడు. సిల్లీగా చేయను అంటూనే సెల్ఫ్ నామినేషన్ లోకి రావడం ఎంతవరకూ కరెక్ట్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా వీకండ్ దీనిపైన నాగార్జున యావర్ కి ఫుల్ క్లాస్ పీకే ఛాన్స్ ఉంది. అందుకే, బిగ్ బాస్ టీమ్ షాకింగ్ ఎలిమినేషన్ గా యావర్ ని చేస్తారా అని కూడా అనిపిస్తోంది. రెండు కారణాల వల్ల ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంది.
1. యావర్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడంటే గేమ్ పైన – కప్ పైన దృష్టి లేదని అలాగే., నామినేషన్స్ ని సీరియస్ గా తీస్కేలేదని అర్దం. ఇది బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధం ఈ కారణంతో కూడా ఎలిమినేట్ చేయచ్చు.
2. యావర్ సిల్లీ రీజన్స్ చెప్పనని చెప్పాడు. కానీ, షకీలాని చేసినప్పుడు చెప్పిన రీజన్ చాలా సిల్లీనే. ఇలా చాలా విషయాల్లో సిల్లీ రీజన్స్ చెప్పిన నామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయ్.
3. ప్రస్తుతం అన్ అఫీియల్ పోలింగ్ సైట్స్ లో యావర్ డేంజర్ జోనే లో ఉన్నాడు. కాబట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. ఈ కారణాలతో యావర్ ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే., దీపావళి ఎపిసోడ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నో – ఎలిమినేషన్ ఉంటే మాత్రం యావర్ సేఫ్ అవుతాడు. యావర్ ని ఫేక్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మరి బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఈవారం ఎలాంటి ఊహించని షాక్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.