భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తెలంగాణలో ఈ సినిమా ఐదో షోకు అనుమతులు రావడంతో పాటు పెరిగిన టికెట్ రేట్లు అమలవుతుండటంతో తెలంగాణలో ఈ సినిమా కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఏపీలోని పలు ప్రాంతాల్లో టికెట్ రేట్ల గురించి అధికారులు థియేటర్ల ఓనర్లకు సూచనలు చేస్తూ నోటీసులను పంపుతుండగా ఆ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ సినిమా రిలీజ్ సమయంలోనే ఏపీ ప్రభుత్వం కఠినంగా నిబంధనలను అమలు చేస్తుందంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలు భీమ్లా నాయక్ కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది. అయితే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరని ఆయన చెప్పుకొచ్చారు.
ఐ యామ్ విత్ భీమ్లా నాయక్ అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇప్పటికే నిబంధనలు అమలులో ఉండగా బెదిరింపు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించడం గమనార్హం. రఘురామ కృష్ణంరాజు చేసిన ట్వీట్ ను మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండగా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. భీమ్లా నాయక్ సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
భీమ్లా నాయక్ సినిమాపై చాలామంది కెరీర్ ఆధారపడి ఉంది. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటించారు. మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియమ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ సినిమా రీమేక్ అయిన భీమ్లా నాయక్ కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందేమో చూడాలి.
When the rules are already there, what is the need to separately issue these kind of threatening notices? Government should stop resorting to such things. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు! I’m with #BheemlaNayak! pic.twitter.com/qbPLxqmIAy
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) February 23, 2022
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!