గోలిసోడా ఫిల్మ్ పతాకంపై సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ అధినేత మల్కాపురం శివకుమార్ సమర్పణలో అర్జున్‌రెడ్డితో యూత్‌ఫుల్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా, శివానీ సింగ్ నాయికగా శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఏ మంత్రం వేసావె.ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కంప్యూటర్, సోషల్‌మీడియాకు బానిసలు కావడం వల్ల నేటి యువత ఒంటరివాళ్లుగా మిగిలిపోతున్నారు. సమాజంతో సంబంధాల్ని తెంచుకుంటున్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరం. ఇదే అంశాన్ని సినిమాలో చూపించాం. కంప్యూటర్ గేమింగ్ సర్వస్వంగా బ్రతుకుతున్న ఓ యువకుడికి ఆన్‌లైన్‌లో ఓ అమ్మాయి పరిచయమవుతుంది. ఒక మాయా ప్రపంచంలో జీవిస్తున్న అతనికి మానవీయ విలువలు ఏమిటో పరిచయం చేస్తుంది. ప్రేమతో అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది.
ఈ క్రమంలో చోటుచేసుకునే ఆసక్తికరమైన సంఘటనలు ఏమిటన్నదే మా చిత్ర కథ.రొమాంటిక్ థ్రిల్లర్‌గా అందరిని ఆలోచింపచేస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని సెన్సార్ వారు ప్రశంసించారు. ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర చిత్రణ భిన్న పార్వాల్లో సాగుతుంది. అర్జున్‌రెడ్డి తరహాలోనే నవ్యతతో ఆకట్టుకుంటుంది అన్నారు. పెళ్లిచూపులు అర్జున్‌రెడ్డి చిత్రాలతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ మంత్రం వేసావె అందరి అంచనాల్ని అందుకునేలా ఉంటుంది. చిత్ర ట్రైలర్‌ను యూట్యూబ్‌లో 20లక్షలమందికిపైగా వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని సమర్పకుడు మల్కాపురం శివకుమార్ చెప్పారు. థియేటర్ల బంద్ గురించి ఆయన మాట్లాడుతూ సర్వీస్ పేరుతో పరిశ్రమలోకి వచ్చిన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ నేడు దోపిడి దొంగలుగా మారారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అన్నారు. కోమ్యా విరాక్, నీలాక్షిసింగ్, శ్రీరామ్ వెంకటేష్, ఆశిష్‌రాజ్, ప్రభావతి తదితరులు నటిస్తున్న