చిన్న వయసులోనే సొంత ఇల్లు.. ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్..!

హిందీ సీరియల్స్ చాలా పాపులర్. తెలుగు ప్రేక్షకులు కూడా హిందీ రాకపోయినా హిందీ సీరియల్స్ చూస్తుంటారు. కొన్నాళ్ళకు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని గమనించి వాటినే తెలుగులోకి డబ్ చేయడం మొదలుపెట్టారు. అలా డబ్ అయినప్పటికీ స్ట్రాంగ్ కంటెంట్ వల్ల అనుకుంట వాటిని మళ్ళీ రీమేక్ కూడా చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. ‘ఏ హై మోహబతిన్’ అనే హిందీ సీరియల్ ను తెలుగులో ‘మనసు పలికే మౌనగీతం’ గా డబ్ చేసి టెలికాస్ట్ చేశారు.

దానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు అదే సీరియల్ ను ‘ఎన్నెన్నో జన్మల బంధం’ గా రీమేక్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ‘ఏ హై మోహబతిన్’ అదే.. ‘మనసు పలికే మౌనగీతం’ లో ఓ ఖుషి అనే పాత్రలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఉండేది. ఆమె పేరు రుహానికా ధావన్. ఆమె పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. ఇప్పుడు ఆ పాప వయసు 15 ఏళ్ళు.

అయితే ఇంత చిన్న వయసులోనే ఆమె సొంత ఇల్లు కొనుగోలు చేసిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియజేసింది. తాను సంపాదించిన ప్రతి రూపాయిని ఆమె తల్లి దాచి సొంత ఇల్లు కొనుగోలు చేసేలా చేసింది అంటూ ఆమె పోస్ట్ లో పేర్కొంది. దీంతో రుహానికా ధావన్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది అని చెప్పాలి.


బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus