Yellamma : గుడ్ మార్నింగ్ అంటూ ఫోటో షేర్ చేసి.. కొత్త చిక్కుల్లో పడ్డ బలగం వేణు
- January 23, 2026 / 04:29 PM ISTByFilmy Focus Desk
‘బలగం’ చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టి ఒక్క సినిమాతోనే సంచలన దర్శకుల జాబితాలో చేరిపోయాడు డైరెక్టర్ వేణు ఎల్దండి. అంతకు ముందు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు వేణు. అయితే దిల్ రాజ్ బ్యానర్ లో ఆయనకు డైరెక్టర్ గా అవకాశం ఇవ్వటం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక అద్భుతమైన గ్రామీణ కధాంశంతో ప్రతి ఒక్కరి మనస్సులో స్థానం సంపాదించాడు వేణు. అదే ఉత్సాహంతో డైరెక్టర్ వేణు తన తదుపరి చిత్రానికి సంబందించిన కథ నిర్మాత దిల్ రాజు కు వినిపించటంతో ఆయన ఆ కథకు ఇంప్రెస్స్ అవ్వటం, మళ్ళి దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా ఒకే అవ్వటం జరిగింది. ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు డైరెక్టర్ వేణు. సోషల్ మీడియా వేదికగా గుడ్ మార్నింగ్ అంటూ రెండు ఫోటోలను జత చేస్తూ పోస్ట్ చేయగా, ఆ ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో కొత్త వివాదానికి దారి తీశాయి. అదేంటంటే..
Yellamma
షూటింగ్లో భాగంగా డైరెక్టర్ వేణు ఒక దేవాలయం పై భాగంలో కూర్చొని ఉండగా, అందులో ఆయన షూస్ ధరించి ఉండటం వివాదానికి కారణం అయింది. ఆలయ ప్రాంగణంలో షూస్ ధరించటం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు అక్కడ కరెంటు కేబుల్స్ కూడా ఉన్నాయని, వాటి నుంచి సేఫ్టీ కొరకు మాత్రమే ధరించి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం వలన ‘ఎల్లమ్మ’ సినిమాకు ఏమన్నా ఇబ్బందులు తలెత్తుతాయేమో అని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనిపై డైరెక్టర్ వేణు అయితే ఇంత వరకు ఏం స్పందించలేదు.

ఇది ఇలా ఉండగా, రీసెంట్ గానే ‘ఎల్లమ్మ’ మూవీకి సంబందించిన గ్లిమ్స్ ఒకటి విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తొలిసారిగా హీరోగా డెబ్యూ చేయనున్నట్లు తెలియపరిచాడు డైరెక్టర్ వేణు.












