2022 లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ , శాండల్ వుడ్, మలయాళం.. ఇలా పక్క భాషల్లోని సినీ ప్రముఖులు చాలా మంది మరణించారు. నటీనటులు, నిర్మాతలు, ఫ్యాషన్ డిజైనర్లు, లేదా సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా మంది మరణించారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత, తొలిప్రేమ వంటి చిత్రాలను నిర్మించిన జి.వి.జి రాజు భార్య పద్మజ మరణించిన సంగతి తెలిసిందే.
ఈమె ప్రముఖ నటుడు హరనాథ్ కూతురు కూడా అన్న సంగతి తెలిసిందే. మరోపక్క సీనియర్ స్టార్ నటుడు కైకాల సత్యనారాయణ కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదాల నుండీ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో యువనటి ఆత్మహత్య చేసుకుని మరణించడం విషాదకరం. వివరాల్లోకి వెళితే… ప్రముఖ యువనటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా బిజీ నటిగా కొనసాగుతూ వచ్చింది.
ముంబైలో షూటింగ్ లో పాల్గొంటున్న టైంలో ఈమె ఓ రూంలో ఉరేసుకుంది . తర్వాత చిత్ర బృందం హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది. చక్రవర్తి అశోక్ సామ్రాట్, మహారాణా ప్రతాప్, అలీబాబా.. వంటి సీరియల్స్ తో పాటు దబాంగ్ 3, కహానీ2.. వంటి సినిమాల్లో కూడా నటించింది.ఈమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.ఈమె వయసు 20 ఏళ్ళే కావడం విచారకరం.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?