నందమూరి తారక రామారావు బయోపిక్ మూవీ”ఎన్టీఆర్”ని అద్భుతంగా తెరకెక్కించాలని డైరక్టర్ తేజ సంకల్పంతో ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ప్రజల గుండెల్లో నిలిచిపోయేదాకా.. అతని జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలని ఆవిష్కరించడానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం నటసింహ బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. పూర్తిగా నయం అయిన తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో బాలయ్య 102 వేషాలు వేయనున్నారు. సాయి కొర్ర పాటి నిర్మిస్తున్న మూవీలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రోల్ ని పోషించడానికి నదియా ముందుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్ యుక్తవయసు పాత్రలో నటించటానికి యంగ్ హీరో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కేవలం ఐదు నిముషాల పాటు వెండితెరపై కనిపించనున్న ఈ రోల్ కోసం తేజ సంప్రదించగానే.. మహానటుడు సినిమా కావడంతో శర్వానంద్ వెంటనే ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తేజ్ వెంకటేష్ తో ఆట నాదే.. వేటా నాదే సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని వేగంగా కంప్లీట్ చేసి.. ఎన్టీఆర్ మూవీ కోసం పూర్తి సమయం కేటాయించనున్నారు. తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ 2019 సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.