టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాది క్రితం వరకు కాజల్, తమన్నా, రష్మిక, పూజా హెగ్డే, సమంత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ 12 నెలల కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ హీరోయిన్లకు బదులుగా కృతిశెట్టి, శ్రీలీల పేర్లతో పాటు కేతిక శర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్లతో పాటు యంగ్ హీరోయిన్ నేహాశెట్టి పేరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. యంగ్ హీరోయిన్లు తర్వాత సినిమాలతో సక్సెస్ లను అందుకుంటే ఈ హీరోయిన్లకు స్టార్ హీరోయిన్లుగా ప్రమోషన్ దక్కనుంది.
కాజల్ కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం కాగా రీఎంట్రీ ఇచ్చినా ఈ హీరోయిన్ కు గతంలోలా ఆఫర్లు రావడం కష్టమేనని తెలుస్తోంది. తమన్నాకు కూడా కొత్త ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తమన్నాకు ఛాన్స్ లు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుండగా ఈ సినిమాల ఫలితాలపైనే సమంత కెరీర్ ఆధారపడి ఉంది. శాకుంతలం, యశోద సినిమాలతో పాటు విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో సమంత నటిస్తున్నారు.
అయితే పాన్ ఇండియా హీరోలు సమంతపై దృష్టి పెట్టడం లేదు. పుష్ప ది రైజ్ సక్సెస్ సాధించినా ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్లాప్ రష్మిక కెరీర్ పై ప్రభావం చూపుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోలు రష్మికకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. మరో హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. పూజా హెగ్డే చేతిలో కొన్ని ఆఫర్లు ఉన్నా ఆమెకు కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని తెలుస్తోంది.
వరుస ఫ్లాపులు ఈ హీరోయిన్ కెరీర్ కు మైనస్ అయ్యాయి. యంగ్ హీరోయిన్ల నుంచి ఈ స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే ఈ హీరోయిన్లలో ఎంతమంది స్టార్ హీరోయిన్లు వచ్చే ఏడాది నాటికి ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరమవుతారో ఎంతమంది యంగ్ హీరోయిన్లు వరుస ఆఫర్లతో బిజీ అవుతారో చూడాల్సి ఉంది.