Tamannaah: తమన్నా కెరీర్ అక్కడ ఆగినట్లేనా..!

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్లై దాటి పోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించారు త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తానుచాటుతోంది. తాజాగా మలయాళంలోకి అడుగుపెట్టింది. అరుణ్ గోపీ దర్శకత్వంలో త‌మ‌న్నా, దిలీప్ నటించిన మలయాళ చిత్రం ‘బాండ్రా’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ఏడుగురు యూట్యూబర్లు తప్పుడు రివ్యూలు ఇచ్చారంటూ ‘బాండ్రా’ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ అజిత్ వినాయక ఫిల్మ్స్..

తిరువనంతపురంలోని కోర్టుకు ఆశ్రయించింది. వాళ్లు ఇచ్చిన తప్పుడు రివ్యూల వల్లే సినిమాకు నష్టాలు వచ్చాయని కూడా ప్రొడక్షన్ సంస్థ రిపోర్టులో పేర్కొంది. తిరువనంతపురం కోర్టు త్వరలోనే ఈ యూట్యూబర్లపై తగిన యాక్షన్ తీసుకోవాలి అని అజిత్ వినాయక ఫిల్మ్స్ కోరింది. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించాలని కావాలనే ఈ యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు రివ్యూలను ఇచ్చాయని తెలిపింది.

ఇలాంటి రివ్యూ బాంబింగ్ వల్ల ఫిల్మ్ మేకర్స్‌కు కోట్లలో నష్టం ఉంటుందని, అందుకే కొందరిపై ఇలాంటి యాక్షన్ తీసుకుంటే మిగతావారు కూడా ఇలా చేయడానికి భయపడతారని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ కారణం వల్ల ఎన్నో ఏళ్లుగా సౌత్ సినీ పరిశ్రమలో స్టార్‌గా వెలిగిపోతున్న తమన్నాకు మలయాళంలో ఇది డెబ్యూ చిత్రం. దీంతో తమన్నా (Tamannaah) కూడా ఈ మూవీ హిట్ అయితే మాలీవుడ్‌లో తన కెరీర్ సాఫీగా సాగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

కానీ ఎంత హైప్ మధ్య విడుదలయిన కూడా ‘బాండ్రా’కు తగినంత ఆదరణ లభించలేదు. దీనికి నెగిటివ్ రివ్యూలు కూడా కారణం కావడంతో ఆ యూట్యూబర్లపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని మూవీ టీమ్ కోరుకుంటున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus