మోకాళ్ల మీద కూర్చొని ఏడ్చిన అమ్మ రాజశేఖర్‌

బిగ్‌బాస్‌ ఈ వీకెండ్ సీరియస్‌గానే ఉండబోతుంది అని మనం ఇప్పటికే అనుకున్నాం. నామినేషన్‌ టాస్క్‌ విషయంలో హౌస్‌మేట్స్‌ మీద నాగార్జున ఫైర్‌ అయిన విషయమూ చూశాం. అయితే ఎపిసోడ్‌లో సీరియస్‌నెస్‌ అక్కడితో ఆగినట్లుగా లేదు. హీరో /జీరో పేరుతో నాగార్జున ఓ గేమ్‌ పెట్టాడు. అందులో ఎమోషన్స్‌ పండటం పక్కనపెడితే… అమ్మ రాజశేఖర్‌ కన్నీళ్లు బయటికొచ్చాయి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించే రాజశేఖర్‌ మాస్టర్‌ ఎందుకేడ్చారు? దానికి కారణం ఎవరు?

‘మీ ఇంట్లో జీరో అనుకున్నవాళ్లను జీరో అనే గేట్‌ నుండి బయటకు తోయండి’ అనగానే అమ్మ రాజశేఖర్‌ను దేవీ నాగవల్లి మెడపట్టి మరీ బయటకు తోసేసింది. ఆ తర్వాత లాస్య కూడా అదే పని చేసింది. ‘కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా?’ అని దేవీ అంటే…, ‘శ్రుతి మించిన కామెడీని నేను యాక్సెప్ట్‌ చేయలేను’ అంటూ లాస్య అంది. దీంతో అమ్మ రాజశేఖర్‌ హర్ట్‌ అయ్యి ‘నేను వెళ్లిపోతాను’ అంటూ నాగార్జునను అడిగాడు. అక్కడితో ఆగకుండా నాకు ఓట్లు వేయకుండా నన్ను బయటకు పంపేయండి అంటూ ప్రజలను కూడా అడిగాడు.

జీరో గేట్‌ నుండి బయటకు వచ్చి మోకాళ్ల మీద నిల్చుని మరీ బాధపడ్డాడు. నన్నెవరూ ఇప్పటివరకు మెడ మీద చెయ్యి పెట్టి బయటకు నెట్టేయలేదు. ఇక్కడ అది జరిగింది. అయితే గంగవ్వ తీర్పు వేరేలా ఉండింది. ఈ హౌస్‌లో మాస్టార్‌ ఉండాల్సిందే తేల్చిచెప్పింది. అయినప్పటికీ మాస్టర్‌ ఏడుస్తూనే ఉన్నాడు. మరి నాగార్జున ఏమన్నాడు, అమ్మ రాజశేఖర్‌ ఏం చేశాడనేది ఈ రోజు ఎపిసోడ్‌లో చూడొచ్చు. నిన్న మొన్నటివరకు లాస్య, దేవీ నాగవల్లి మాస్టర్‌తో బాగానే ఉన్నారు. ఒక్కసారిగా ఏమైందో. ఏదైతేనేం మాస్టర్‌ బాధపడేసరికి నోయల్‌, అవినాష్‌, మెహబూబ్‌, సోహైల్‌, అభిజీత్‌ బాయ్స్‌ ముందుకొచ్చి సముదాయించడం బాగుంది. ఇక్కడ కూడా అఖిల్‌ దూరంగా ఉండటం గమనించాల్సిన విషయం. మొన్న టాస్క్‌లో టీమ్‌ మెంబర్‌ అయిన కుమార్‌ సాయి కూడా దూరంగానే ఉన్నాడు.

 

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus