యాక్షన్ చిత్రాల్లో ఎన్నో ఫైట్లు ఉంటాయి.. కానీ కొన్ని మాత్రం శెభాష్ అనిపించుకుంటాయి. అలాగే తెలుగు సినిమాల్లో ఇప్పటికి ఎంతో మంది ఆయుధాలను ఉపయోగించారు. వాటిలో కొన్ని మాత్రం మన మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయాయి. ఎంతగా అంటే ఆ వెపన్ చూడగానే ఆ చిత్రం మనకి గుర్తుకు వచ్చేంతగా. అంటే మూవీలో ఆయుధం కూడా ఒక పాత్ర అయిందన్న మాట. అటువంటి టాప్ టెన్ వెపన్స్ పై ఫోకస్…
సైకిల్ చైన్సైకిల్ చైన్ కూడా ఆయుధం అని నిరూపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శివ చిత్రంలో కింగ్ నాగార్జున పట్టిన చైన్ ట్రెండ్ ని సృష్టించింది.
సింహాద్రి గొడ్డలిసాధారణమైన గొడ్డలిని అనేక సినిమాల్లో చూసి ఉంటాం. అయితే సింహాద్రి సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ శత్రువులను చీల్చి చెండాడే గొడ్డలి భిన్నంగా ఉంటుంది. రెండు వైపులా పదును ఉండేలా దర్శకుడు రాజమౌళి దీనిని రూపొందించారు.
విక్రమార్కుడి గొడ్డలివిక్రమార్కుడు సినిమాలో విక్రమ్ రాథోడ్ ఉపయోగించే ఆయుధం వినూత్నంగా ఉంటుంది. పదునైన విష్ణు చక్రాన్ని ఒక రాడ్ కి అమర్చినట్లు ఉండే ఈ వెపన్ అందరినీ ఆకట్టుకుంది.
బద్రీనాథ్ కత్తివివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బద్రీనాథ్ చిత్రంలో అల్లు అర్జున్ వాడిన కత్తి అద్భుతంగా ఉంటుంది. నాలుగు అడుగుల పొడవుతో .. పదునుతో ఉన్న కత్తి బలమైన ఆయుధంగా పేరు తెచ్చుకుంది.
సింహ గొడ్డలియాక్షన్ సినిమాల హీరో నందమూరి బాలకృష్ణ సింహ తో అపూర్వ విజయం సాధించారు. ఇందులో ఆయన ఉపయోగించిన సింహం మొహం కలిగిన గొడ్డలి కిరాక్ పుట్టించింది.
సూదిసూది ఆయుధం అంటే ఎవరికైనా నమ్మబుద్దికాదు. కానీ ఈగ సినిమాలో సూదినే మెయిన్ వెపన్ గా జక్కన్న చూపించారు. ఇందులో విలన్ ని మట్టు పెట్టడానికి సూది నే ఉపయోగించారు.
కర్రపాత చిత్రాల్లో కర్రలతో అనేక ఫైట్స్ చూసాం. కానీ కెమెరా మెన్ గంగ తో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన కర్ర స్పెషల్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఈ స్టిక్ భలే నచ్చింది.
బాహుబలి గొడ్డలిబాహుబలి చిత్రంలో అనేక ఆయుధాలు ఉపయోగించారు. ఇందులో ప్రభాస్ వాడిన చిన్న గొడ్డలి మాత్రం అందరికీ గుర్తిండి పోయింది. ఈ గొడ్డలి ముద్దు వచ్చే ఆయుధంగా క్రెడిట్ కొట్టేసింది.
అయస్కాంత చైన్ గదబాహుబలి చిత్రంలో ప్రత్యేకంగా ఆకర్షించిన ఆయుధం అయస్కాంత చైన్ గద. భల్లాల దేవ చేతిలో ఉండే ఈ ఆయుధం కాలకేయుడిని చంపి యుద్ధంలో కీలక పాత్ర పోషించింది.
సంపూ గొడ్డలిహృదయకాలేయంలో సంపూర్ణేష్ డైలాగ్స్ నవ్వించడమే కాదు, ఆయుధంతో కూడా పగలబడి నవ్వేలా చేశారు. ఇదివరకు ఎక్కడా చూడని విధంగా గొడ్డలిని పట్టి ఫైట్ చేశారు.