థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను మెప్పించడమే నటుల లక్ష్యం. ఏ భాషలో అయినా లక్ష్యం మాత్రం మారదు. ప్రేక్షకుల అభిరుచి మేరకు వారు అభిమానించే హీరోల్లో మార్పు ఉంటుంది. ఒకే రకమయిన అభిరుచి కలిగిన తెలుగు, హిందీ ఫ్యాన్స్ ని బాలీవుడ్, టాలీవుడ్ హీరోలను మ్యాచ్ చేయమంటే.. ఇదిగో ఇలా జత కలిపారు. స్టార్ హీరోలను కలిపిన లెక్కలపై ఫోకస్.
1. మెగాస్టార్, బిగ్ బీసినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా పైకి ఎదిగిన స్టార్లు బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి. స్వశక్తి తో మహా వృక్షంలా ఎదిగి ఎందరికో ఆదర్శ ప్రాయులయ్యారు.
2. బాలయ్య, సన్నీ డియోల్మాట తో వేటు వెయ్యగల సత్తా ఇక్కడ నందమూరి బాలకృష్ణ సొంతమైతే, అక్కడ సన్నీ డియోల్ వసం. అద్భుత డైలాగులు ఉండే వీరి సినిమాలు మాస్ ఆడియన్స్ కి విందు భోజనమే.
3. వెంకీ, సంజయ్ దత్విక్టరీ వెంకటేష్, మున్నాభాయ్ సంజయ్ దత్.. వీరిద్దరూ ఏ పాత్రలో నైనా ఒదిగి పోతారు. చాల సులువుగా కామెడీ ని పండించగలరు. అంతేకాదు ఎటువంటి ఈగోలకు వెళ్లకుండా మల్టీ స్టారర్ మూవీలు చేయడానికి ముందుంటారు.
4. నాగ్, అజయ్ దేవగన్కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహించడంలో కింగ్ నాగార్జున, అజయ్ దేవగన్ ఎల్లప్పుడూ ముందుంటారు. వీరు ఎంచుకునే కథల్లో కూడా కొత్తదనం ఉంటుంది. వీరిద్దరూ సహా నటిని పెళ్లి చేసుకున్న వారు కావడం విశేషం.
5. పవన్, సల్మాన్కొంచెం తిక్క ఉంది.. దానికో లెక్కుంది.. అనే డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించుకోగల స్టార్లు పవన్ కళ్యాణ్, సల్మాన్ ఖాన్. వీరు అడుగు పెడితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. పవన్, సల్మాన్ సినిమాల రిలీజ్ రోజు అభిమానులకు అదో పెద్ద పండుగ.
6. మహేష్ బాబు, షారుఖ్ ఖాన్అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్లు మహేష్ బాబు, షారుఖ్ ఖాన్. వీరి సినిమాలు ఇండియాలోనే కాదు ఓవర్ సీస్ లోను రికార్డు కలక్షన్స్ వసూల్ చేసాయి. “సినిమా ఎలా ఉందో అవసరం లేదు.. ఓసారి చూడాలి అంతే..” వీరి ఫ్యాన్స్ అభిప్రాయమిది.
7. రవి తేజ, అక్షయ్ కుమార్ఓ వైపు యాక్షన్ చేస్తూనే.. మరో వైపు కామెడీ పండించగల హీరోలు రవి తేజ, అక్షయ్ కుమార్. వీరు హుషారుగా ఉంటూ తోటి వారిని ఉత్సాహపరుస్తుంటారు. రవితేజ సినిమాలు అక్షయ్ కుమార్ హిందీలో రీమేక్ చేసి విజయం అందుకున్నారు.
8. ప్రభాస్, హృతిక్ రోషన్పీరియడ్ మూవీలకు సరిపోయే బాడీ కలిగిన హీరోలు ప్రభాస్, హృతిక్ రోషన్. తమ నటనతో ఆ పాత్రకు ప్రాణం పోస్తారు. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరూ వీరిని ఆదరిస్తారు.
9. ఎన్టీఆర్, అమీర్ ఖాన్సినీ పరిశ్రమలో నిత్య విద్యార్థులు జూనియర్ ఎన్టీఆర్, అమీర్ ఖాన్. తమకు సూటయ్యే కథలను ఎంచుకోవడమే కాదు.. నచ్చిన కథలకు తగినట్లుగా మారిపోవడం కూడా వీరికి తెలుసు.
10. రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్పరిశ్రమలు గర్వించదగ్గ నటులకు వారసులు రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్. స్టార్ కిడ్స్ గా పుట్టినా తమ కంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతుంటారు.