Shankar: 3 భాగాలుగా శంకర్ రూ.1000 కోట్ల ప్రాజెక్టు ఫిక్స్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మరో భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాంచరణ్ తో ‘ఆర్.సి.15′(వర్కింగ్) చిత్రాన్ని తెరకెక్కిస్తూనే మరోపక్క కమల్ హాసన్ తో ‘ఇండియన్2’ ప్రాజెక్టును కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ అయ్యాక శంకర్ చేయబోయే సినిమా ఏంటనే విషయం పై కూడా క్లారిటీ వచ్చేసింది అంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. వివరాల్లోకి వెళితే.. సు వెంకటేశన్ రచించిన ‘వేల్పారి’ నవల ఆధారంగా ఓ చారిత్మాక సినిమాను శంకర్ తెరకెక్కించాలని భావిస్తున్నట్టు సమాచారం.

దీనికి అక్షరాలా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌ అవుతుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుని శంకర్ 3 భాగాలుగా తెరకెక్కిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టులో సూర్య లీడ్ రోల్‌ పోషిస్తారని.. కేజీఎఫ్ స్టార్ యష్, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌లు కీలక పాత్రలు పోషిస్తారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్‌లో శంకర్ హీరోగా తీసుకోవాలి అనుకున్నది విజయ్ ను అని తెలుస్తుంది. కొన్ని నెలల క్రితమే శంకర్ విజయ్ కు కథ వినిపించడం జరిగింది.

ఇది విజయ్ కు నచ్చింది. విజయ్.. చిన్న డైరెక్టర్లతో సినిమాలు చూస్తుంటేనే అవి రూ.300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నాయి. అది కూడా ప్లాప్ నెగిటివ్ టాక్ తో..! అదే శంకర్ వంటి సరైన డైరెక్టర్ తో విజయ్ సినిమా చేస్తే.. ఫలితం ఇప్పుడున్న దానికి 5 రెట్లు ఉంటుంది అనడంలో సందేహం లేదు. నిజానికి విజయ్ అంటే శంకర్ కు బాగా అభిమానం. ‘ఒకే ఒక్కడు’ చిత్రాన్ని విజయ్ తో చేయాలనుకున్నాడు శంకర్..

కానీ ‘నాన్బన్’ వంటి యావరేజ్ సినిమా చేసి సరిపెట్టాడు. శంకర్ – విజయ్ కాంబోలో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్‌’ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం. విజయ్ కూడా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ అనే చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత మళ్ళీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus