12వ వారం నామినేషన్స్ లో శ్రీసత్యకి పంచ్..! ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ ప్రక్రియని కన్ఫెషన్ రూమ్ లో జరిపాడు బిగ్ బాస్. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఇద్దర్ని నామినేట్ చేసి సరైన రీజన్స్ చెప్పమని అడిగాడు. దీంతో ఫస్ట్ రోహిత్ వచ్చి శ్రీహాన్ ని నామినేట్ చేశాడు. టాస్క్ లో మెరీనాపై అరవడం తనకి నచ్చలేదని, అలాగే, శ్రీహాన్ అంతలా రియాక్ట్ అవ్వాల్సని అవసరం కూడా అక్కడ లేదని చెప్పాడు.

తర్వాత ఫైమా తనని పాము, నిచ్చెనల టాస్క్ లో వాసంతీ కన్నా ఎక్కువ మట్టి ఉన్నా కూడా నన్నే ఎలిమినేట్ చేసిందని చెప్పాడు. ఇలా అందరూ తమ కారణాలు చెప్తూ నామినేషన్స్ లో తమ పవర్ ని చూపించారు. ఇక్కడ ఎక్కువ మంది హౌస్ లో శ్రీహాన్ ని టార్గెట్ చేశారు. శ్రీహాన్ కి 4 ఓట్లు పడ్డాయి. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.,

రోహిత్ – శ్రీహాన్ ఇంకా ఫైమా
శ్రీసత్య – రోహిత్ – రాజ్
రాజ్ – శ్రీహాన్ – శ్రీసత్య
కీర్తి – శ్రీహాన్ – శ్రీసత్య
ఫైమా – రోహిత్ – ఇనాయ
శ్రీహాన్ – రోహిత్ – ఆదిరెడ్డి
ఇనాయ – ఫైమా – రాజ్
ఆదిరెడ్డి – ఇనాయా – శ్రీహాన్
రేవంత్ – ఫైమా – ఆదిరెడ్డి లని నామినేట్ చేశారు.

నామినేషన్స్ లో శ్రీసత్యకి బిగ్ బాస్ పంచ్ ఇచ్చాడు. రాజ్ ని గత మూడువారాలుగా నామినేషన్స్ లోకి రాలేదని రీజన్ చెప్పి వెళ్లిపోతుంటే, కూర్చోండి అంటూ సరైనా రీజన్ చెప్పి నామినేట్ చేయమని చెప్పాడు. తను ఈవారం గేమ్ లో సరిగ్గా ఆడలేదని, పెర్ఫామన్స్ కూడా పెద్దగా కనిపించలేదని చెప్పింది. మొత్తానికి నామినేషన్స్ లో శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. రోహిత్, రాజ్, కీర్తి, ఇంకా ఆదిరెడ్డి నలుగురు శ్రీహాన్ ని టార్గెట్ చేశారు. అందరూ మెరీనాపై అరిచాడనే కారణమే ఆల్ మోస్ట్ చెప్పారు. మెరీనాకి తర్వాత సారీ చెప్పిన విషయం గుర్తులేదు.

అంతేకాదు, ఇక్కడ మెరీనా తన హెల్త్ గురించి మాట్లాడుతుంటేనే శ్రీహాన్ అరిచాడు. తన పాయంట్ ని తను సూటిగా చెప్పడానికి ప్రయత్నించాడు. తను అలా ఆవేశపడి ఉండకూడదని తర్వాత మెరీనా దగ్గరకి వెళ్లి సారీ చెప్పాడు. దీనికి కీర్తి, రోహిత్, రాజ్ ముగ్గురూ కూడా అనుకుని వేసినట్లుగానే ఉంది. అలాగే ఆదిరెడ్డి అయితే శ్రీహాన్ పై ఏకంగా నాలుగు కారణాలు చెప్పాడు. ఏది ఏమైనా ఈవారం నామినేషన్స్ లో పెద్దగా హైలెట్ అయిన అంశం ఏదీ లేదు. మరి ఈవారం ఇంటి నుంచీ వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus