Movies: ఆగస్టు 15న షేక్ అయిన ఇండియన్ బాక్సాఫీస్!

ఆగస్టు నెల వచ్చింది అంటే బాక్సాఫీస్ కి బాగా కలిసొస్తుంది అని అంతా అంటుంటారు. మరీ ముఖ్యంగా ఆగస్టు 15న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతూ ఉంటారు. సినిమా ఎలాంటిదైనా వారికి సంబంధం లేదు. చిన్న సినిమాలు అయినా సరే ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. గత వారం ‘జైలర్’ ‘భోళా శంకర్’ ‘ఓ మై గాడ్ 2’ ‘గదర్ 2’ ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ ‘ఉస్తాద్’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇందులో ‘ఉస్తాద్’ ‘భోళా శంకర్’ ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ చిత్రాలు తీసేస్తే.. మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అయితే నిన్న ఆగస్టు 15న ‘ఉస్తాద్’ ‘భోళా శంకర్’ ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ సినిమాలు కూడా కొంతవరకు బాగానే కలెక్ట్ చేశాయి. ఆ సినిమాలు కలెక్ట్ చేసిన వాటితో పాటు.. మొత్తంగా నిన్న ఒక్కరోజే రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.

2023లో ఒకే రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇంత గ్రాస్ నమోదవ్వడం ఇదే మొదటిసారి. ఓ రకంగా ఇది సెన్సేషన్ అని చెప్పాలి. అయితే రాబోయే రోజుల్లో ‘జైలర్’ ‘గదర్ 2’ ‘ఓ మై గాడ్’ వంటి సినిమాలు ఇంకా బాగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ‘ఉస్తాద్’ ‘భోళా శంకర్’ ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ (Movies) సినిమాల రన్ అంతగా ఉండకపోవచ్చు అని చెప్పాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus